480 గ్రాముల శిశువు

12 May, 2020 05:10 IST|Sakshi
అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువు

పాడేరు జిల్లా ఆస్పత్రిలో జననం 

ఇంత తక్కువ బరువుతో పుట్టి బతికి ఉండటం ఇదే ప్రథమమంటున్న వైద్యులు

పాడేరు: మన్యంలో అతి తక్కువ బరువుతో ఓ శిశువు పుట్టింది. పెదబయలు మండలం గలగండ పంచాయతీ గసాబు గ్రామానికి చెందిన ఉల్లి కృష్ణకుమారి ఆరు నెలల గర్భిణి. ఈ నెల 9న పురిటి నొప్పులు రావడంతో పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అబార్షన్‌ చేయాలని తొలుత వైద్యులు భావించారు. అయితే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు స్కానింగ్‌లో తేలడంతో అదే రోజు అతికష్టం మీద కాన్పు చేశారు.

పుట్టిన మగబిడ్డ బరువు కేవలం 480 గ్రాములే ఉండటంతో బేబీ కేర్‌ యూనిట్‌లో ఉంచి సేవలందిస్తున్నట్టు డాక్టర్‌ పి.ప్రవీణ్‌వర్మ చెప్పారు. ఇంత తక్కువ బరువుతో బిడ్డ పుట్టి, ఇప్పటి వరకూ జీవించి ఉండటం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని వైద్యులు చెప్పారు.

మరిన్ని వార్తలు