తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక...

24 Sep, 2015 03:46 IST|Sakshi
తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక...

- హైస్కూల్లోనే పురుగుమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య
బల్లికురవ :
తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక హైస్కూల్లోనే పురుగుమందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బల్లికురవ మండలంలోని కొమ్మినేనివారిపాలెంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకెళ్తే... గ్రామానికి చెందిన దర్శి హనుమంతరావు, వెంకటరత్నం దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె నాగమణికి ఇటీవల వివాహం చేయగా, రెండో కుమార్తె నవ్య (14) స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదవుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలలోని కొందరు విద్యార్థులు ఇటీవల తరచూ నవ్యను వేధిస్తుండటంతో ఈ నెల నాలుగో తేదీ ఇంటి నుంచి పాఠశాలకు పురుగుమందు తీసుకెళ్లి తాగి ఆత్మహత్యకు యత్నిం చింది.

ఉపాధ్యాయుల ద్వారా సమాచారం అందుకున్న విద్యార్థిని కుటుం బ సభ్యులు.. గ్రామంలో ప్రథమ చికిత్స చేయించి అదేరోజు మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పదిరోజుల పాటు చికిత్స పొందిన విద్యార్థిని ఆరోగ్యం కుదుటపడింది. హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఏఎం శ్రీనివాసరావు కూడా వైద్యశాలకు వెళ్లి నవ్యను పరామర్శించి వచ్చారు. అయితే, బుధవారం ఒక్కసారిగా నవ్య ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. హైస్కూల్ ఉపాధ్యాయులు నవ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. పాఠశాలకు సెలవు ప్రకటించి సంతా పం తెలిపారు. ఎస్సై శ్రీహరిరావు విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు.
 

మరిన్ని వార్తలు