రెండు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన

2 Apr, 2015 03:01 IST|Sakshi

కడప, అనంతపురం: కేంద్ర కరువు బృందాలు బుధవారం వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పర్యటించాయి. వైఎస్సార్ జిల్లాలో  కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ డెరైక్టర్ వందనా సింగాల్, కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖకు చెందిన వాటర్ క్వాలిటీ స్పెషలిస్టు డాక్టర్ బ్రజేష్ శ్రీ వాత్సవ, నీతి అయోగ్ సీనియర్ రీసెర్చి ఆఫీసర్ డాక్టర్ రామానంద్‌లతో కూడిన బృందం పర్యటించింది.

జిల్లాల్లో ఏర్పడిన కరువు పరిస్థితుల గురించి, పంటల సాగు, నీటి సమస్యల గురించి కలెక్టర్ కేవీ.రమణ కరువు బృందానికి వివరించారు.  కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ పి.షకీల్‌అహ్మద్ నేతృత్వంలో డీఏసీ జేడీ నరేంద్రకుమార్, మానిటరింగ్ అండ్ అప్రైసర్ డెరైక్టరేట్ డెరైక్టర్ పంకజ్‌త్యాగి, ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఏపీ రీజియన్ డీజీఎం గోవర్థన్‌రావులతో కూడిన బృందం అనంతపురంలో పర్యటించింది. అనంతపురం జిల్లాకు తక్షణ సాయంగా రూ. 1,404.55 కోట్లు అవసరమని కలెక్టర్ కోనశశిధర్ ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు