అడ్డగోలుగా భూ పందేరం

19 Aug, 2015 23:54 IST|Sakshi
అడ్డగోలుగా భూ పందేరం

చట్టాలు, తీర్పులు బేఖాతరు చేసి మరీ..
625 ఎకరాల జూపార్కుభూములపై పెద్దల కన్ను
పీపీపీ విధానంలో అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేయత్నం
జూపార్కును కంబాలకొండకు తరలించే వ్యూహం

 
 వన్యప్రాణి చట్టాలు అడ్డురావు.... న్యాయస్థానం తీర్పులూ పట్టవు. అస్మదీయులకు భూపందేరమే లక్ష్యం అన్నట్లుగా తయారైంది ప్రభుత్వ తీరు. అందుకే వన్యప్రాణుల ఆవాసాలకు పెనుముప్పు కలిగిస్తూ మరీ  భూపందేరానికి పన్నాగం పన్నుతోంది.  విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు కు చెందిన 625 ఎకరాలను లక్ష్యంగా చేసుకుంది. అక్కడి నుంచి జూపార్కును తరలించి ఆ భూములను నైట్‌సఫారి, రిసార్టుల పేరుతో పీపీపీ విధానంలో ఆ భూములను తమ అనుకూల సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తోంది. ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం తన పంతం నెగ్గించుకునే దిశగా పావులు కదుపుతోంది.  విశాఖపట్నం
 
గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. కంబాలకొండ రిజర్వు ఫారెస్టుకు జూపార్కును తరలిస్తామని కూడా వెల్లడించారు.  దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజానీకం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. విశాఖపట్నంలో ఆందోళనలు నిర్వహిస్తున్నా మంత్రి గంటా మాత్రం తాము జూపార్కును తరలిస్తామని పునరుద్ఘాటిస్తున్నారు. ఇందుకోసం డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) రూపొందించాలని వుడా అధికారులను కూడా ఇప్పటికే మౌఖికంగా ఆదేశించారు. ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానం తీర్పులను బేఖాతరు చేస్తోంది.

పాంథర్ బయోస్పీయర్ నేచరల్ పార్కుకు ముప్పు : శివారులోని 16వేల చదరపు కి.మీ.లలో విస్తరించిన కంబాలకొండ అరుదైన చిరుతపులలకు సహజసిద్ధ ఆవాసంగా ఉంది. అందులో 8కిపైగా చిరుతపులులు సంచరిస్తున్నట్లు 2007లోనే అటవీశాఖ గుర్తించింది. చిరుతల సంఖ్యను పెంచేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర అటవీశాఖ 2013లో సర్వే నిర్వహించి కంబాలకొండను ‘పాంథర్ బయోస్పియర్ నేచురల్ పార్కు’గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రకారం కంబాలకొండ అభయారణ్య ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.  కానీ మంత్రి గంటా  ఆ కంబాల కొండలో 200 ఎకరాల్లో జూపార్కును ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. జూపార్కు ఏర్పాటు చేయాలంటే కంబాలకొండ అభయారణ్యంలో భవన, రోడ్లు  నిర్మాణాలు చేపట్టాలి. ఇది కేంద్ర నిబంధనలకు విరుద్ధం.
 సుప్రీం కోర్టు తీర్పూ బేఖాతరు  : అభయారణ్యాల్లో పర్యాటకాభివృద్ధి పేరుతో నైట్‌సఫారీలు ఏర్పాటు చేయకూడదని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  పులులు సంచరించే అభయారణ్యాల్లో నైట్‌సాఫారీలు, రిసార్టులు ఏర్పాటు చేయమని కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఈ తీర్పును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం జూపార్కును కంబాలకొండ అభరాణ్యానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కంబాల కొండను ఆనుకుని ఉన్న జూపార్కులో నైట్‌సఫారీ, రిసార్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  జూపార్కుకు చెందిన విలువైన 625 ఎకరాలను తమ అనుకూల సంస్థలకు కట్టబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చట్టాలు, న్యాయస్థానాల తీర్పులను బేఖాతరు చేస్తోందని స్పష్టమవుతోంది.
 
 

మరిన్ని వార్తలు