వియ్యంకుల వారి భూ విందు | Sakshi
Sakshi News home page

వియ్యంకుల వారి భూ విందు

Published Thu, Sep 7 2023 3:38 AM

Ponguru Narayana and Ganta Srinivasa Rao massive land grab - Sakshi

సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆధారాలతో సహా వెలికి తీసింది.

టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్‌ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్‌డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియో­గం చేశారు.

అసైన్డ్‌ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్‌ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్‌ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్‌ పూలింగ్‌ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. 

బినామీల ఖాతాల్లోకి డబ్బులు..
వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్‌ భూములను కొల్లగొ­ట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్‌ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్‌డీఏ, రెవె­న్యూ అధికా­రుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు.

అనంతరం తమ బినామీ­లు అయిన ఆర్కే హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతి­నిధులతో ఆ భూములను కారు చౌకగా కొను­గోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటె­డ్‌కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీ­లుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు.

అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్‌ భూములను సేల్‌ డీడ్‌ ద్వారా హస్తగతం చేసుకు­న్నారు. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్‌డీడ్‌లు రిజిస్టర్‌ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు.

రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్‌ రైతులు
అసైన్డ్‌ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్‌ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్‌ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్‌ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్‌ విలువ అమాంతం పెరిగేలా చేశారు.

అమరావతిలో ఎకరా మార్కెట్‌ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కా­యి. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది.

కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూము­లను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసు­కున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్‌ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దా­లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. 

Advertisement
Advertisement