గౌతమి అందరికీ ఆదర్శం:కమల్ హాసన్

25 Jan, 2015 08:57 IST|Sakshi
గౌతమి అందరికీ ఆదర్శం:కమల్ హాసన్
  • యశోద అంతర్జాతీయ కేన్సర్ సదస్సులో సినీ నటి గౌతమి
  • మనో నిబ్బరమే ఆయుధమని, ధైర్యంగా పోరాడాలని పిలుపు
  • రోగులకు కౌన్సిలింగ్ అవసరమన్న కమల్‌హాసన్
  • సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌ను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని సినీ నటి గౌతమి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతమవుతోందని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి తెలిసిన ఎవరో ఒకరికి కేన్సర్ వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. యశో ద ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ కేన్సర్ సదస్సు ప్రారంభమైంది.

    గౌతమితో పాటు సుప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. ‘నాకు కేన్సర్ వచ్చింది. కీమోథెరపీ చేయించుకున్నా. మళ్లీ వచ్చింది. చికిత్స చేయించుకుంటే మళ్లీ తగ్గింది. ఇలా వివిధ వేదికలపై కేన్సర్‌పై ప్రచారం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. అందరికీ ఆ బాధ్యత ఉంది. ఇది కూడా ఇతర వ్యాధుల వంటిదే. దీన్ని మనం పారదోలగలం’ అని అన్నారు. కేన్సర్ వచ్చిన వారికి మనోధైర్యం చాలా ముఖ్యమని, శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు పోరాడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ మద్దతు కూడా చాలా ముఖ్యమన్నారు.
     
    మూలకణ మార్పిడి కేంద్రం ప్రారంభం

    కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ కేన్సర్ సదస్సును కమల్ ప్రారంభించారు. బోన్‌మారో(ఎముక మజ్జ), స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్(మూలకణ మార్పిడి కేంద్రం)ను ఆ ప్రక్రియలో సిద్ధహస్తులైన డాక్టర్ మమ్మెన్ చాందీ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా మారుతోందన్నారు. మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ.. వైద్యరంగంలో నగరానికి ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. కాగా, గతంలో కార్డియాలజీపై దృష్టిపెట్టిన తాము ఇప్పుడు కేన్సర్‌పై కేంద్రీకరించామని యశోద ఆసుపత్రి ఎండీ జీఎస్ రావు తెలిపారు.
     
    గౌతమి అందరికీ ఆదర్శం..
     
    కేన్సర్‌ను జయించేందుకు గౌతమి ఎం తో ధైర్యం ప్రదర్శించిందని కమలహాసన్ అన్నారు. అనేక సినిమాల్లో నటిం చిన తాను సైడ్ క్యారక్టర్‌నేనని.. ఆమె నిజమైన హీరో అని కితాబిచ్చారు. కేన్సర్ వస్తే ఎదురొడ్డి పోరాడాలని పేర్కొన్నారు. కేన్సర్ రోగులకు మానసిక నిబ్బరానికి కౌన్సిలింగ్ అవసరమన్నారు. చాలామంది కేన్సర్‌తో చనిపోతున్నారనేది నిజం కాదన్నారు. హోటల్‌పైనో, క్రికెట్‌పైనో కాకుండా వైద్యరంగంపైనే యశోద ఆసుపత్రి యాజమాన్యం ఖర్చు పెట్టడం అభినందనీయమన్నా రు.

    వివిధ దేశాలకు చెందినవారు ఇక్కడ కేన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్నారని, మేక్‌ఇన్ ఇండియా లో యశోద యాజమాన్యం తనవంతు బాధ్యత నెరవేర్చుతోందన్నారు. ధనికులు సమాజానికి సేవలందిం చాలన్నారు. గౌతమి, తాను మళ్లీ సినిమాలో కలిసి నటిస్తున్నామనివెల్లడించారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తే పేదల కోసం ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి తగిన నిధులు సమకూరుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు