'కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం'

13 May, 2020 11:19 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయమని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పేర్కొన్నారు. బుధవారం కడప నగరంలో పర్యటించిన ఆయన పాత కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో రైతులకు విత్తనాలు సరఫరా చేశారు. ఈ  కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు సాంబటూరు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతులకు అండగా ఉండేదుకు ఈ నెల 15న రైతు భరోసా పంపీణీ చేపడతామన్నారు. అలాగే మే18 నుంచి వేరుశనగ విత్తనాలను కూడా పంపీణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా