అంగన్‌వాడీ కేంద్రాలకూ ఈ-పాస్

19 May, 2016 05:44 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్): అంగన్‌వాడీ సెంటర్లకు కూడా ఈ- పాస్ విధానంలోనే సరుకులు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ప్రద్యుమ్న జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఆయన స్త్రీ శిశు సంక్షేమశాఖ కమిషనర్ చక్రవర్తితో కలసి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ చౌకదుకాణం పరిధిలో ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలున్నాయో పరిశీలించి మ్యాపింగ్ చేయాలన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్త విధిగా ఈ-పాస్‌లో వేలి ముద్ర వేస్తేనే సరుకులు ఇవ్వాలన్నారు. కర్నూలు నుంచి ఐసీడీఎస్ పీడీ అరుణ మాట్లాడుతూ  జిల్లావ్యాప్తంగా 2414 చౌకదుకాణాలున్నాయని, ఇందులో 2043 షాపులకు అంగన్‌వాడీ కేంద్రాలను మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు