నేత్రదానంపై ఎస్పీ గానం

19 May, 2016 05:47 IST|Sakshi
నేత్రదానంపై ఎస్పీ గానం

సెవెన్‌స్టార్ మ్యూజికల్ సెంటర్‌లో గానం చేస్తున్న ఎస్పీ
 
కర్నూలు: నేత్రదానంపై ప్రజలను చైతన్యపరచి లక్ష మందిని ఒప్పించే లక్ష్యంతో ఉన్నట్లు  ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ‘నేత్రదానం చేయండి.. మరో ఇద్దరు అంధులకు వెలుగునివ్వండి, మరణంలోనూ జీవించండి’ అంటూ నేత్రదానంపై ఎస్పీ ఓ పాట రాశారు. స్వయంగా సంగీతం సమకూర్చుకుని పాడా రు. కర్నూలు ఆంధ్ర కిచెన్ వేర్ సమీపంలోని సెవెన్‌స్టార్ మ్యూజికల్ సెంటర్‌లో థ్రిల్లర్ తెలుగులో మొదటి పాప్ గీతం పాడి ఆడియో, వీడియోల రూపంలో బుధవారం సీడీలను విడుదల చేశారు. ఎస్పీ దంపతులు నేత్రదాన పత్రాలపై ఇదివరకే సంతకాలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అవయవదాన పత్రాలపై కూడా సంతకాలు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. నేత్రదానంపై ఆలపించిన గానంను యూట్యూబ్‌లో చూడవచ్చన్నారు. ఈ గీతాన్ని విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అంకితమిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
 
 
 
 

మరిన్ని వార్తలు