వైఎస్సార్‌ రైతు భరోసా నేడు ప్రారంభం

15 Oct, 2019 05:37 IST|Sakshi

వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం

నెల్లూరులో సీఎం జగన్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

54 లక్షల మంది వరకు లబ్ధిపొందే అవకాశముందని అంచనా

ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, సాగుదారుల ఎంపిక

లబ్ధిదారులందరికీ ఒకే రోజు నిధుల జమ

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయాన్ని మంగళవారం జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హమైనవిగా అధికారులు తేల్చారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు.   
 
► ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రకటించిన తేదీ, ప్రాంతం: జులై 8వ తేదీ 2017 – గుంటూరు (పార్టీ ప్లీనరీలో)
► తొలుత అర్హత : ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు
► తర్వాత మారిన అర్హత : అన్నదాతలందరికీ వర్తింపు
► తొలుత ప్రకటించిన సాయం : ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000
► తాజాగా ప్రకటించిన సాయం : ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలలో రూ.67,500
► జగన్‌ ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని (రైతు బంధు) అమలు చేసిన రాష్ట్రం : తెలంగాణ
► కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పథకం : పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన


ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్టాళ్లను పరిశీలించిన తర్వాత రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి అన్నదాతలతో మాట్లాడతారు. సభ ముగిశాక రేణిగుంట చేరుకుని విమానంలో గన్నవరం వెళ్తారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘షార్‌’లో  ప్రమాదం

అన్నదాతలకు మరింత భరోసా!

సినీ పరిశ్రమకు అండదండలు అందిస్తానన్నారు

స్థానికులకే 75 % ఉద్యోగాలపై నిబంధనలు జారీ

‘వైఎస్సార్‌ పాలనను సీఎం జగన్‌లో చూస్తున్నారు’

ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు: రాఘవులు

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ..

విశాఖ చాలా బాగుంది: యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రొఫెసర్‌ రాఘవేంద్రపై సస్పెన్షన్‌ వేటు

భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!

ఆ రికార్డు చంద్రబాబుకే దక్కుతుంది...

అదనంగా ఏడు లక్షల మందికి వైఎస్సార్‌ పెన్షన్లు

రైతులకు సీఎం జగన్‌ మరో వరం

సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి శిక్షణ

పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్సీ

‘కాళ్లు పట్టుకోవడం తప్ప మరో సిద్దాంతం లేని నాయకుడు’

‘అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి ప్రయత్నం’

‘నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది.. ఖబర్దార్‌ ’

సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు

రేపే రైతు భరోసా.. సీఎం జగన్‌ సమీక్ష

ప్లేట్‌లెట్స్‌ ఒక ప్యాకెట్‌ రూ.14వేలు

సరిహద్దు నుంచి యథేచ్ఛగా మద్యం..

ఎల్‌'ఛీ'డీ

‘అందుకే ఆరోపణలు చేస్తున్నారు’

కంటి వెలుగు ప్రసాదించాలని..

‘లోకేష్‌ను కన్నందుకు బాబు బాధపడుతున్నాడు’

సెలవులకు టాటా..స్టేషన్‌ కిటకిట

సాగర జలాల్లో సమర విన్యాసాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెండితెర గ్రౌండ్‌లో...

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది – రాజేంద్రప్రసాద్‌

లేడీ పోలీస్‌

బంపర్‌ ఆఫర్‌

పరమ వీర

కొత్త నాగశౌర్యను చూస్తారు