కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం జగన్‌

14 Feb, 2020 07:47 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మళ్లీ ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం శనివారం మధ్యాహ్నానికి సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 12న జగన్‌ ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను వివరించి చేయూత నివ్వాలని కోరిన విషయం విదితమే. (చదవండి: ఏపీ అభివృద్ధికి ఊతమివ్వండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా