ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్‌ క్లియర్‌

2 Jul, 2020 19:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది. అయితే శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలిలో ఆమోదించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో మండలి డిప్యుటీ చైర్మన్‌ ద్రవ్య వినమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్‌ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్‌కు ద్రవ్య వినయమ బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా