పంచాయతీల్లో ప్రత్యేక పాలన

2 Aug, 2018 08:15 IST|Sakshi
గ్రామ పంచాయతీ వ్యూ

కడప ఎడ్యుకేషన్‌: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనకే ప్రభుత్వం మొగ్గుచూపింది. ఉత్కంఠకు తెరదించుతూ స్పెషలాఫీసర్లను నియమించాలని జీఓ 90ని బుధవారం విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. పాలకవర్గాల గడువు గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పర్సన్‌ ఇన్‌చార్జులా లేక ప్రత్యేకాధికారుల పాలనా అనే దానిపై మొదటి నుంచి సందిగ్ధం నెలకొంది. దీనిపై రాష్ట్రప్రభుత్వం నోరు మొదపకపోవడంతో సర్పంచ్‌లలో ఆందోళన నెలకొంది.

ఎన్నికలు లేవని తేల్చుకున్న సర్పంచ్‌లు కనీసం పర్సన్‌ ఇన్‌చార్జులుగానైనా కొనసాగించాల ని డిమండ్‌ చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించగా  దీనిపై కోర్టు కూడా పర్సన్‌ ఇన్‌చార్జులుగా సర్పంచ్‌లను నియమించడంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆదేం తమకు పట్టదన్నట్లుగా రాష్ట్రప్రభుత్వం స్పెషలాఫీసర్లను నియమించాల ని జీఓను విడుదల చేసింది. అంటే ఈ ప్ర భుత్వానికి కోర్టులపైన ప్రజాస్వామ్యంపై ఎంత గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతుం దని సర్పంచ్‌లు విమర్శిస్తున్నారు.

ఓటర్ల జాబితాను ప్రకటించినా..
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాల ని ఎన్నికల కమిషన్‌ అధికారులను అదేశిం చింది. ఈ మేరకు అధికారులు గత నెలలోనే ఓటర్ల జాబితాను ప్రచురణ కూడా చేశారు.
 
మొదలైన కసరత్తు
ప్రభుత్వం పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని జీఓ విడుదల చేయడంతో జిల్లా పంచాయతీ అధికారులు స్పెషలాఫీసర్ల నియామకానికి కరసత్తు మొదలుపెట్టారు. మండలస్థాయిలో తహసీల్దారు. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి తగ్గకుండా ఉండేవారిని నియమించాలని సూచించడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. స్పెషలాఫీసర్లు  తాగునీటి సరఫరా, నూతన నిర్మాణాలకు అనుమతులు, ట్రేడ్‌ లైసెన్సులు, తాగునీటి సరఫరాలో పైపుల లీకేజీలను అరికట్టడం, మోటర్ల మరమ్మతులు, దుకాణాల పన్నుల వసూలు, తాగునీటిలో క్లోరినేషన్, రోడ్లను శుభ్రం చేయడం, కాల్వలను శుభ్రంచేయడం వంటి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది.

ఓటమి భయంతోనే..
రాష్ట్రప్రభుత్వం అధికారంలో ఉండి కూడా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించపోవడం పై జిల్లాలో తీవ్రచర్చ సాగుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుందని సర్పంచ్‌లు విమర్శి స్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై చూపుతుందనే వెనుకంజ వేసిందని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలనే పర్సన్‌ ఇన్‌చార్జులుగా కొనసాగించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పలువురు సర్పం చులు డిమాండ్‌ చేసినా వారి విన్నపాలను ఈ రాష్ట్రప్రభుత్వం తోసిపుచ్చుతే స్పెషలా ఫీసర్ల నియామకానికే మొగ్గుచూపింది. దీని పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ప్రగతికి ఆటంకం..
ప్రత్యేకాధికారుల పాలన వస్తే ప్రగతికి ఆటంకం ఏర్పడనున్నట్లు చర్చ సాగుతోంది. గ్రామాల్లో నీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిలైట్లు వెలగకపోయినా ప్రజా అవసరాల దృష్ట్యా  సర్పంచ్‌లు తమ జేబు నుంచి ఖర్చుచేసి పనులను సవరించేవారు. తర్వాత నిదానంగా నిధులు వచ్చినప్పుడు బిల్లులు పెట్టుకుని డబ్బులను డ్రా చేసుకునేవారు. ప్రత్యేక పాలనలో ఆ స్వేచ్ఛ ఉండ దు. నిబంధనల ప్రకారం అన్నీ జరగాల్సిందే. ఇలా అయితే ప్రజలు ఇబ్బందుల పాలు కాక తప్పదని సర్పంచ్‌లు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు