ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

16 Jul, 2019 13:16 IST|Sakshi
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు

సాక్షి, కడప : తమకు ఏడు నెలలుగా నిలిపివేసిన జీతాలు, పారితోషికం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఏఐయూటీసీ ఆ«ధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు జి.వేణుగోపాల్, అధ్యక్షురాలు సుభాషిణి, ప్రధాన కార్యదర్శి అయ్యవారమ్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఇందువల్ల తాము  ఆర్థిక ఇబ్బందులు  ఎదుర్కొవాల్సి వస్తోందని వివరించారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులైందని, పిల్లలకు ఫీజులు, పుస్తకాలు కొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌ వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కేవలం రూ 150 పారితోషికంతో గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు అనారోగ్య కారణాలుగా కొన్నిరోజులు విధులకు హాజరు కాలేదని, ఈ కారణంగా పీహెచ్‌సీ అధికారులు వారిని డ్రాపౌట్స్‌ చేశారని తెలిపారు. డ్రాపౌట్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆశాలపై పీహెచ్‌సీ అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని అన్నారు. కొంతమంది ఆశాలను విధులకు రావద్దని రాజకీయ నాయకులకు అనుకూలంగా పీహెచ్‌సీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం సరికాదని చెప్పారు. స్థానిక రాజకీయ నాయకుల అనుచరులను ఆశాలుగా నియమించుకునే వీలును పీహెచ్‌సీ అధికారులు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆశాలు రాజీనామాలు చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తక్షణమే ఆపాలన్నారు. వీటిపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు రూ. 10 వేలు జీతం, పాత పద్దతి ప్రకారం ఇస్తామన్న పారితోషికానికి సంబంధించిన జీఓలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.

బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు..
కడప సెవెన్‌రోడ్స్‌ : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్‌.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని,   అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు.  అనంతరం కలెక్టర్‌ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.  యూనియన్‌ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ,  వెంకట శివ,  మేరి, అమరావతి, అబ్దుల్‌ ఘని, జాకోబ్‌ తదితరులు పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్‌.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని,   అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు.  అనంతరం కలెక్టర్‌ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.  యూనియన్‌ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ,  వెంకట శివ,  మేరి, అమరావతి, అబ్దుల్‌ ఘని, జాకోబ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా
ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహా, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్‌  మాట్లాడుతూ కార్పొరేట్‌ విద్యా సంస్థల ఆగడాలకు  అదుపు లేకుండా ఉందని అన్నారు. ఐఐటీ, టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏసీ క్యాంపస్‌  పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు,    షూ, యూనిఫాం వంటివి పాఠశాలల్లోనే అమ్ముతూ విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు.

విచ్చలవిడిగా ఫీజుల దందా కొనసాగిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లకు ఉచిత విద్య అందించాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయక్, రాజేంద్ర, డీవైఎఫ్‌ఐ నాయకులు జగదీష్, స్టీఫెన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సునీల్, ఐద్వా నాయకురాలు ఐఎన్‌ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు