విద్యుత్ చార్జీలు పెంచ‌లేదు: బాలినేని

15 May, 2020 14:43 IST|Sakshi

సాక్షి, ప్రకాశం :  .ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని విద్యుత్ శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. శ్లాబుల ధరలు ఎక్క‌డ పెంచ‌లేద‌ని, గ‌తంలో ఏదైతే విద్యుత్ చార్జీలు ఉన్నాయే వాటినే ప్ర‌స్తుతం అమ‌లు పరుస్తున్నామ‌ని మంత్రి స్ప‌స్టం చేశారు. శుక్ర‌వారం మంత్రి బాలినేని మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు ఎక్క‌వ రావ‌డంతో ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో అపోహ‌లు నెల‌కొన్నాయ‌న్నారు. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో విద్యుత్ వినియోగం ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం వ‌ల్ల బిల్లులు పెరిగాయ‌ని, దీనిపై అధికారులు ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌ని పేర్కొన్నారు  (విద్యుత్‌ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం: బుగ్గన)

మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ...మాచవరం మృతుల సంఘటనపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  వెంటనే స్పందించి పరమార్శించేందుకు మంత్రులను పంపించి 5లక్షల ఎక్స్ గ్రేషియాను 10 లక్షలకు పెంచార‌ని తెలిపారు. భాదిత కుటుంబాల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగం కల్పించాలని దళిత సంఘాలు కోరాయని, .దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. తిమ్మసముద్రంలో చెరువులో పడ్డ బాలున్ని కాపాడబోయి మృతి చెందిన ముగ్గురు మహిళల కుటుంబాలను కూడా ఆదుకుంటాని మంత్రి పేర్కొన్నారు. (‘విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవం’)

మరిన్ని వార్తలు