కల్తీలకు ఆస్కారం ఇవ్వొద్దు : టీటీడీ చైర్మన్‌

9 Jul, 2019 18:45 IST|Sakshi

సాక్షి, తిరుపతి : భక్తుల అన్నప్రసాదాల నాణ్యత విషయంలో జాగ్రత్త వహించాలని టీడీపీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు, అన్నప్రసాదాల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలని అన్నారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ధాన్యసేకరణ జనరల్ మేనేజర్ జగదీశ్వర్‌రెడ్డి మంగళవారం కలిశారు. బియ్యాన్ని టెండర్ విధానంలో సేకరించే విధంగా ప్రణాళిక రూపొందించాలని సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీకి అవసరమైన బియ్యం, నెయ్యి, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్ మొదలైన వాటిని సేకరించే విధానంలో పారదర్శకత పాటించాలని కోరారు. ప్రతిరోజు సుమారు రెండు లక్షల మందికి పైగా అన్నదానము చేస్తున్నామని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. సుమారుగా నెలకు 600 టన్నుల బియ్యం అవసరమని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని అన్నారు. చైర్మన్‌ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు