‘నోరు జాగ్రత్త.. అందులో తప్పేముంది’

14 May, 2017 17:05 IST|Sakshi
‘నోరు జాగ్రత్త.. అందులో తప్పేముంది’

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రధానిని వైఎస్‌ జగన్‌ కలవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం తగదని, ఆ విషయాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌​ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు పలు రకాలు విమర్శలు చేస్తున్నారు. దీంతో మండిపడిన సో​ము వీర్రాజు టీడీపీ చెప్పినట్లు వినాల్సిన అవసరం తమకు (బీజేపీకి) లేదని అన్నారు. ఈ నెల 25న అమిత్‌ షా నేతలకు దిశా నిర్దేశం చేస్తారని అన్నారు. తాము త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా