జలగలే నయం..!

23 May, 2018 09:45 IST|Sakshi
ఎర్రగుంట్ల తహసీల్దార్‌ కార్యాలయం

ప్రతి పనికి ఒక రేటు

లంచం ఇవ్వనిదే కదలని ఫైళ్లు

అడిగినంత ఇవ్వక పోతే అన్ని పనులు జాప్యమే  

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించారు. లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదిలేపరిస్థితి కనిపించలేదని ప్రజలు వాపోతున్నారు. ఈ కార్యాయలంలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది లంచాలు మరిగి ప్రజా సమస్యలను మరిచారు. ఈ–పాస్‌బుక్కు, సర్టిఫికెట్లు , ఫ్యామిలీ సర్టిఫికెట్‌ ఇలా ఏదైన సరై ముందు చేయి తడిపితేనే పనులు అవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గత సోమవారం రైతు ఓబులేసు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటు డిప్యూటీ తహసీల్దార్‌ పటాన్‌ ఆలిఖాన్, వీఆర్‌ఓ బాషావలిలు ఏసీబీకి చిక్కారు.

మామూళ్ల మత్తులో సిబ్బంది
తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వీఆర్‌ఓలు ఇష్టారాజ్యంగా వసూళ్లుకు తెరలేపారు. ఇలా తీసుకున్న డబ్బులో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, వీఆర్‌ఓలకు అంటు వాటాలు వేసుకుంటున్నారు. ఇలా వేధించడంతో ప్రజలు ఎందుకు ఈ కార్యాలయానికి రావాలి అని విస్తుపోతున్నారు. భూమికి కొత్త పాసుబుక్కు మంజూరు చేయాలన్నా, పాసుబుక్కులో, ఆన్‌లైన్‌లో పేర్లు మార్చాలన్నా, అదనపు భూమికి ఎక్కించాలన్నా ఒకొక్క పనికి ఒక రేటును పెట్టారు. ఇలా ప్రతి పనికి రూ.5 వేలు నుంచి రూ.30 వేలు వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కులధ్రువీకరణ, ఆదాయ,  ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు అయితే రూ.500 నుంచి రూ.2000 వరకు అడ్డంగా వసూళ్లు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే మండలంలో ఇసుక క్వరీకి అనుమతి లేదు. అయినా రెవెన్యూ అధికారులు ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్‌ నుంచి డబ్బులు తీసుకొని అనుమతి ఇస్తున్నారు.

పాసుబుక్కు కోసం ఐదు నెలలుగా..
తన భూమి వివరాలన్నీ ఆన్‌లైన్‌ ఎక్కినాయి. పాసుబుక్కు కోసం ఐదు నెలలుగా తిరుగుతున్నా ఇంత వరకూ వీఆర్‌ఓలు పలకలేదు. తిప్పలూరు గ్రామంలో సర్వేనంబరు 243, 245లలో సుమారు రెండు ఎకరాలు దాక భూమి ఉంది. దీనికి పాసుబుక్కు కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఇంత వరకు ఇవ్వలేదు.– పాలగిరి మహుబూబ్‌బాషా, తిప్పలూరు,ఎర్రగుంట్ల

మరిన్ని వార్తలు