-

శభాష్ ప్రియాంక

16 Apr, 2016 01:52 IST|Sakshi
శభాష్ ప్రియాంక

బస్సులో 4 సవర్ల బంగారం, రూ.3 వేలు మరిచిన మహిళ
దొరికిన బంగారం, డబ్బును కండక్టర్‌కు ఇచ్చిన ప్రయాణికురాలు
పోలీసుల సహకారంతో పోగొట్టుకున్న మహిళకు అప్పగింత

 

పిచ్చాటూరు: ఓ యుువతి బస్సులో తనకు దొరికిన 4 సవర్ల బంగారు చైను, 3 వేలు నగదును కండక్టర్, పోలీసుల ద్వారా పోగొట్టుకున్న వుహిళకు అప్పగించిన సంఘటన శుక్రవారం పిచ్చాటూరులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కథనం మేరకు తిరుపతి గాయుత్రీ నగర్‌లో నివాసం ఉన్న లక్ష్మీ కాంతమ్మ అనే వృద్ధురాలు విజయుపురం మండలంలోని ఆలపాకంలోని బంధువుల ఇంటికి బయులుదేరింది. తిరుపతి నుంచి పిచ్చాటూరు చేరుకొని అక్కడ నుంచి మరో బస్సులో ఆలపాకం చేరుకోవాల్సి ఉంది. ఈ క్రవుంలో ఉదయుం 7.45 గంటలకు తిరుపతిలో తిరువుల-చెన్నై ఎక్స్‌ప్రెస్ ఆర్‌టీసీ బస్సు ఎక్కి 9.15 గంటలకు పిచ్చాటూరుకు చేరుకుంది. ఆకలిగా ఉండడంతో లక్ష్మీకాంతవ్ము పిచ్చాటూరులోని ఓ హోటల్‌కు చేరుకొని టిఫిన్ చేయుడానికి వెళ్లింది. టిఫిన్ చేయుడానికి తన వద్ద ఉన్న పర్సును చూసుకుంది. పర్సు కనపడలేదు.


వెంటనే తన పర్సు బస్సులో పెట్టి వురిచిపోరుునట్టు గుర్తు వచ్చింది. అప్పటికే బస్సు బయులుదేరి వుద్రాసు వైపు వెళ్లిపోరుుంది. వెంటనే చుట్టుపక్కల వారి సహాయుంలో స్థానిక ఎస్‌ఐ వునోహర్‌కు సవూచారం అందించింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ వునోహర్ తన సిబ్బంది నటరాజన్‌తో కలిసి బస్సును వెంబడించే ప్రయుత్నం చేశారు. బస్సు నాగలాపురం వుండలం సుబ్బానాయుుడు కండ్రిగ వద్ద టిఫిన్ కోసం ఆపి ఉన్నట్లు గుర్తించారు. బస్సు వద్దకు వెళ్లగానే అప్పటికే బస్సులో ప్రయూణిస్తున్న శేషంపేటకు చెందిన ప్రియూంక పర్సును తీసి కండక్టర్ వద్దకు చేర్చింది. కండక్టర్ నుంచి పర్సును స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ స్టేషన్‌లో ఉన్న లక్ష్మీకాంతవ్ముకు అప్పగించారు. తప్పిపోరుున తన బంగారం, డబ్బును వుళ్లీ తనకు ఇప్పించిన పోలీసులకు, కండక్టర్‌కు, ప్రియూంకకు లక్ష్మీకాంతవ్ము కృతజ్ఞతలు చెప్పారు.

మరిన్ని వార్తలు