‘బడ్జెట్’పై స్పందించని శాఖలు..

7 Jul, 2014 15:31 IST|Sakshi

93 శాఖల్లో 77 నుంచే సమాచారం  ఆర్థిక శాఖ అసంతృప్తి
నేటిలోగా పూర్తి సమాచారం తెప్పించాలని తాజాగా లేఖ


హైదరాబాద్: అరకొర సిబ్బంది.. ఒక్కో అధికారికి మూడు నాలుగు శాఖల అప్పగింత.. ఇదంతా బడ్జెట్ ప్రతిపాదనలు, అంచనాల తయారీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సంబంధిత  శాఖల అధికారుల నుంచి బడ్టెట్ ప్రతిపాదనలు, ఉద్యోగుల వివరాలను జూన్ 30 లోగా కచ్చితంగా పంపించాలని ఆర్థిక శాఖ గత నెల 12నే ఉత్తర్వులు జారీ చేసింది. అయినా అధికారుల నుంచి స్పందన కరువైంది. 93 శాఖలకుగాను.. 77 శాఖల నుంచే సమాచారం లభించింది.

మిగిలిన శాఖలు స్పందించకపోవడంపై ఆర్థిక శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధిపతులు ఆయా విభాగాల అధిపతుల నుంచి గురువారంలోగా పూర్తి సమాచారం తెప్పించాలని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి రామకృష్ణారావు తాజాగా లేఖ రాశారు.     
 

మరిన్ని వార్తలు