పదో వేతన సవరణ చేపట్టాలి

19 Dec, 2013 03:45 IST|Sakshi

కరీంనగర్ అర్బన్,న్యూస్‌లైన్ : ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులందరికీ పదో వేతన సవరణ చేపట్టి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పలు బ్యాంకుల సిబ్బంది బుధవారం ఆందోళన చేపట్టారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా  ఆయా బ్యాంకులకు చెందిన యూని యన్‌ల నాయకులు మాట్లాడారు.  ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణను వెంటనే చేపట్టాలని, అలాగే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాంభద్రయ్య, వెంకటేశం, సత్యనారాయణ, వీరభద్రయ్య, శంకర్, బాపు,  సురేంద్ర, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌బీహెచ్  కార్యాలయాల ఎదుట చేపట్టిన ఆందోళనల్లో జిల్లా ఆఫీసర్స్ ఆవార్డు ఎంప్లాయీస్ యూని యన్ నాయకులు ఏఎల్‌ఎన్ శాస్త్రీ, జీవన్‌కుమార్, నారాయణ, బాషుమియా తదితరులు పాల్గొన్నారు.
 
 యూనియన్ బ్యాంకు ఎదుట చేపట్టిన కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన వేతన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభ్యులు సంపత్, రమాదేవి, విజయ, రియాజ్, శంకర్, నవీన్, రాజు, సాయికృష్ణ, సరిత, శ్రీవాణి, ఫిరోజ్, తిరుపతి, రాజేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎస్‌బీఐ ఎదుట చేపట్టిన ఆందోళనల్లో స్టాఫ్ యూనియన్ కార్యదర్శి నంద కిశోర్, శ్రీనివాస్, కృష్ణ, వెంకటేశ్వర్లు, సలీంపాషా, శ్రీకాంత్, యశోధ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.  
 

>
మరిన్ని వార్తలు