ప్రజాస్వామ్యం అపహాస్యం

9 Jun, 2015 01:22 IST|Sakshi

శ్రీకాకుళం అర్బన్: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాల యంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటుకు ఓటు వ్యవహారంలో టీడీపీ నాయకులు పక్కాగా దొరికిపోయి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు చూడడం శోచనీయమన్నారు. చంద్రబాబు మొదట అధికారం చేపట్టిందే తనమామకు వెన్నుపోటు పొడవడం ద్వారానని వ్యాఖ్యానించారు.
 
 తప్పు డు విధానం ద్వారా అధికారంలోకి వచ్చిన ఆయన వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డిని విమర్శిం చే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీడియాకు అడ్డంగా చిక్కి కూడా మోసపూరిత వ్యాఖ్యలు చేయ డం టీడీపీ నాయకులకే చెల్లిందన్నారు. చంద్రబాబు నీతిమంతుడైతే తన పదవికి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూమిపూజకు ప్రతిపక్షాలను పిలవకుండా తనసొంత కుటుంబ వ్యవహారం లా చంద్రబాబు వ్యవహరించడం శోచనీయమన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ కార్యకర్తలకే ఇళ్లు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పరిటాల సునీత మాట్లాడడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.
 
  బొత్స సత్యనారాయణ చేరికతో విజయనగరంలో వైఎస్సార్‌సీపీ మరింత బలోపేతం అయ్యిందన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబే ఎమ్మెల్సీ ఓటుకు నోటు ఘటనలో ప్రధాన సూత్రధారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, పార్టీ గ్రీవెన్స్‌సెల్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, నాయకులు మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, పొన్నాడ రుషి, శిమ్మ వెంకట రావు, కోరాడ రమేష్,  తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదరరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు