‘మమ్మల్నీ బతకనీయండి!’

13 Sep, 2014 02:23 IST|Sakshi

సంతనూతలపాడు, (ఫొటోలు- ఎం.ప్రసాద్): గ్రామసీమల్లో పాడి ఉన్న కుటుంబాలకు ప్రత్యేక గౌరవం. ఆ ఇంట సిరులు పండుతాయని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. వ్యవసాయం కలిసిరాకున్నా రెండు మూడు గేదెలు పెంచుతూ వచ్చే ఆదాయంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేవి. వేకువనే లేచి వాటికి దాణా కలిపి.. పాలు పితికి, తర్వాత మైదానాల్లోకి తోలుకుపోయి పచ్చగ్రాసం మేత గా వేసేవారు. అక్కడే చెరువుల్లో దించి శుభ్రంగా తోమి తిరిగి సాయంత్రం పాలు సేకరిస్తూ.. వాటిని కంటికి రెప్పలా కాపాడేవారు.

పల్లెల్లో పచ్చని బైళ్లున్నంతకాలం.. వర్షాలు సమృద్ధిగా కురిసినంతకాలం పాల సేకరణతో జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు తల్లకిందులయ్యాయి. కరువు కోరలు చాచింది. ఎండు గడ్డికీ దిక్కులేదు. దాణా ధరలు అందనంత ఎత్తుకు పెరిగాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గేదెలకు కనీసం తాగు నీరు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి వాతావరణంలో పశుపోషకులు తల్లడిల్లిపోక ఏం చేయగలరు? ఇల్లు గడవడమే గగనమైతే.. ఇక గేదెలను ఎలా పోషించగలరు? సరైన ఆహారం లేకుంటే గేదెలు పాలివ్వవు.. అలాంటప్పుడు వాటిని మేపి ఉపయోగం ఏంటి? అందుకే వాటిని సంతలో తెగనమ్ముకుంటున్నారు.

మరిన్ని వార్తలు