సీఎస్లతో కేంద్ర జలసంఘం కార్యదర్శి భేటీ

24 Jun, 2014 12:20 IST|Sakshi

హైదరాబాద్ : కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పాండ్య మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో విడి విడిగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మలతో కృష్ణా జలాలపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల వివాదంపై రెండు ప్రభుత్వాలతో పాండ్య చర్చించారు.

కాగా కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉంది. రాష్ట్రా స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 25 నుంచి నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాల్సి ఉంది. గడువు దగ్గరకు వస్తున్నా... ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నీటి విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివాదంపై కేంద్ర జలసంఘం ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఓ కొలిక్కి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ను కూడా పాండ్యా కలిసే అవకాశం ఉంది.

 

మరిన్ని వార్తలు