'చంద్రబాబుకు అనంతపురంపై ప్రేమ ఎక్కువ'

23 Jul, 2014 09:37 IST|Sakshi

హైదరాబాద్ :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన సొంత నియోజకవర్గం చిత్తూరు కంటే అనంతపురంపై ప్రేమ ఎక్కువని, జిల్లాకు ఏదో చేయాలనే తపన ఆయనలో అనేకసార్లు ప్రస్ఫుటమైందని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈనెల 24, 25 తేదీలలో అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. బాబు పర్యటన సందర్భంగా జిల్లాలో రెండు మొబైల్ రైతు బజార్లు  ప్రారంభించడంతో పాటు పలు గ్రామాల్లో ప్రజలు సమస్యలు రోడ్షో ద్వారా తెలుసుకుంటారన్నారు.    

 

మరిన్ని వార్తలు