'పోలీసులకు సెలవు ఇవ్వడం కుదరదు' | Sakshi
Sakshi News home page

'పోలీసులకు సెలవు ఇవ్వడం కుదరదు'

Published Wed, Jul 23 2014 9:18 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఎన్. చినరాజప్ప - Sakshi

రాజమండ్రి: రాష్ట్ర పోలీసు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ, డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్ప తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. బుధవారం రాజమండ్రిలో చినరాజప్ప విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

పోలీసులు వారంతపు సెలవుపై ఏం నిర్ణయం తీసుకున్నారని విలేకర్లు అడిగిన ప్రశ్నకు చినరాజప్పపై విధంగా సమాధానం చెప్పారు. నెలరోజుల్లో పోలీస్ శాఖను ప్రక్షాళిస్తామని చెప్పారు. ఇసుక తవ్వకాలుపై కొత్త పాలసీని త్వరలో వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ చేయాంటే ప్రభుత్వంపై రూ. 43 వేల కోట్ల భారం పడుతుందని చినరాజప్ప తెలిపారు.

కోనసీమ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిత్యవసర ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కాకినాడలో షెల్ ఆధ్వర్యంలో ఎల్ఎన్జీ టర్మినల్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పెట్రో యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల వాహనాల కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్ల ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement
Advertisement