అయ్యో పాపం

6 Jul, 2018 07:40 IST|Sakshi
అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీప్రసన్న

నాలుగేళ్ల బాలికకు రక్తంలో ఇన్ఫెక్షన్‌

వైద్యానికి రూ.2 లక్షలు అవసరం

దాతల సాయం కోసం ఎదురుచూపు

పశ్చిమగోదావరి, తాళ్లపూడి: ముద్దులొలికే వయసులో ఓ చిన్నారికి పెద్ద కష్టం వచ్చింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం పాపకు వైద్యం చేయించే స్తోమత లేక కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల చేయూత కోసం అర్థిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ప్రక్కిలంక గ్రామానికి చెందిన అనుపోజు కిరణ్మయి కుమార్తె లక్ష్మీప్రసన్నకు నాలుగు సంవత్సరాల వయస్సు. ఇటీవల పాపకు ఆనారోగ్యంగా ఉండడంతో రాజమండ్రిలోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు పాపకు తెల్లరక్త కణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు.

రోజురోజుకు రక్తంలో ఇన్ఫెక్షన్‌ పెరిగిపోతుందని చెప్పారు. శరీరంలో రక్తం మొత్తం మార్చాలని చెప్పారని తల్లి కిరణ్మయి వాపోయారు. సుమారు రూ.రెండు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆర్థికంగా వైద్యం చేయించే స్తోమత లేని ఈ కుటుంబం దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయం చేయదలచుకున్న దాతలు సెల్‌ : 9642081287నంబరులో తెలియజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు