గతంలో ఉద్యోగులకు నన్ను చూస్తే భయం

2 Jun, 2017 01:31 IST|Sakshi
గతంలో ఉద్యోగులకు నన్ను చూస్తే భయం
ముఖ్యమంత్రి చంద్రబాబు
 
సాక్షి, అమరావతి: తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తనను చూసి భయపడేవాళ్లని చంద్రబాబు చెప్పారు. తాను హైదరాబాద్‌లో హెలీకాప్టర్‌ ఎక్కానంటే అది తెలుసుకుని జిల్లాల్లో పరుగులు పెట్టేవారని తెలిపారు. ఆ భయం వల్లే 2004లో తనను ఓడించారని, అందుకే ఇప్పుడు మామూలుగా ఉంటున్నానని చెప్పారు.

వెలగపూడిలో మీడియాతో  ఆయన మాట్లాడారు. ఉద్యోగులను భయంతో పనిచేయించే వాడినని, దాంతో అవకాశం వచ్చినప్పుడు  తనకు వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. అందుకే ఈసారి మామూలుగా ఉంటున్నానని తెలిపారు.
మరిన్ని వార్తలు