నేడు జిల్లాకు సీఎం రాక

7 May, 2015 05:20 IST|Sakshi

చిత్తూరు(సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయలుదేరి 9-40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుం టారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 9-55 గంటలకు తిరుపతి తారకరామ స్టేడియంలోని హెలీప్యాడ్‌కు  చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం చేరుకుంటారు. అక్కడ ప్రియ దర్శిని ఆడిటోరియంలో పది గంటలకు ఏర్పాటు చేసిన పెంటావలెంట్ వ్యాక్సిన్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం హెలీప్యాడ్‌కు చేరుకుని  10-45 గంటలకు  హెలికాప్టర్‌లో  యాదమరి మండలంలోని అమరరాజా ఇండస్ట్రీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 1-45 గంటల వరకు అమరరాజా గ్రోత్ కారిడార్, పీఈఎస్ విద్యా సంస్థల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అరగంట విశ్రాంతి అనంతరం 2-15 గం టలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఏరియల్ వ్యూ ద్వారా నీవా కాలువను పరిశీలిస్తూ.. మధ్యాహ్నం 3 గంటలకు కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. అడవిపల్లె రిజర్వాయర్ పనులను పునఃప్రారంభిస్తారు.

మళ్లీ హెలికాప్టర్‌లో బయలుదేరి ఏరియల్ వ్యూ ద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ మెయిన్ కాలువ, తంబళ్లపల్లె కాలువ, పుంగనూరు కాలువను పరిశీలిస్తూ సాయంత్రం 4-15 గంటలకు మదనపల్లె మిట్స్ కళాశాల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ పుంగనూరు బ్రాంచ్ కాలువ పనులను పరిశీలించి అనంతరం హంద్రీ-నీవా కాలువ బాధిత రైతులతో ముఖాముఖి, హం ద్రీ-నీవా ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ  బస చేస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

మరిన్ని వార్తలు