దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్‌ శంకుస్థాపన

24 Nov, 2023 10:35 IST|Sakshi

పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్‌ 7న సీఎం జగన్‌ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లా­డుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్‌ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు 

మరిన్ని వార్తలు