ఫీ‘జులుం’కు..కళ్లెం

11 Nov, 2019 11:10 IST|Sakshi

సాక్షి, కడప: సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందులో భాగంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. వీటితోపాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధనలను ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం తాజాగా ఇంటర్‌ విద్యపై దృస్టిని సారించారు. అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేశారు. విద్యార్థులే నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట లభించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   ఇంటర్‌ అడ్డగోలు ఫీజుల బాదుడు నుంచి ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇంటర్‌బోర్డు నిర్ణయించిన ఫీజుకంటే కొన్ని కళాశాలల యాజమాన్యం ఎక్కువగా కట్టించుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.

పరీక్షల సమయంలో అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తుండటంతో విద్యార్థులు కిమ్మనకుండా కట్టుకుంటూ వచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ ఫీజుల నియంత్రణపై ప్రత్యేక దృష్టిని సారిచింది. అడ్డుగోలుగా వసూలు చేస్తున్న ఫీజలకు అడ్డుకట్ట వేసింది. ఇంటర్‌ విద్యార్థుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ఎయిడెడ్‌ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన పీజు కంటే అదనంగా వసూలు చేస్తువచ్చాయి. మరి కొన్ని కళాశాలల్లో పరీక్ష సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని భరోసా ఇచ్చి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికి ప్రభుత్వం కల్లేం వేసేందుకు ప్రస్తుత విద్యా సంవతసరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆదనపు ఫీజుల మోత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఫీజుల విషయంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
 
నేరుగా ఫీజు చెల్లించవచ్చు: ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ఇప్పటి వరకు ఆయా కళాశాలల యజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ వచ్చాయి. ఇక నుంచి ఆ విధానానికి చెక్‌ పెడుతూ ఇంటర్‌ విద్యామండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. హెచ్‌టీటీపీ://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ లో నేరుగా విద్యార్థులు ఫీజు వివరాలను చెల్లించే వెసులుబాటు కలి్పంచింది. గతంలో మాదిరిగా విద్యార్థులే నేరుగా కళాశాల ప్రిన్సిపాల్‌ లాగిన్‌లో లేదా విద్యార్థులు ఫీజుకట్టే అవకాశం ఇచ్చింది.  

ఫీజును చెల్లించే విధానం ఇలా... 
ప్రభుత్వం సూచించిన వెబ్‌సైట్‌లో పే ఎగ్జాబిమినేషన్‌ ఫీ అనే దానిపై విద్యార్థులు ముందుగా క్లిక్‌ చేయాలి. విద్యార్థి ఆధార్‌ నంబర్‌ను, యూజర్‌ఐడీగా నమోదు చేసి ఫర్‌గెట్‌ పాస్‌వర్డును క్లీక్‌ చేయాలి. విద్యార్థి సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్‌ అయి ఫీజు చెల్లించవచ్చు. అండ్రాయిడ్‌ మొబైల్‌ ద్వారా,లేదా నెట్‌ పాయింట్‌కు వెళ్లి అయినా ఫీజును చెల్లించవచ్చు 

ఫీజుల వివరాలు ఇలా..

జనరల్‌ ఫస్ట్‌ ఇయర్‌ రూ. 490
ఒకేషన్‌ ఫస్ట్‌ ఇయర్‌   రూ. 680
జనరల్‌ సెకండ్‌ ఇయర్‌  రూ. 680
జనరల్‌ సెకండ్‌ ఇయర్‌   రూ.490
ఒకేషన్‌ సెంకడ్‌ ఇయర్‌    రూ.680

అదనంగా వసూలు చేస్తే చర్యలు... 
ఇంటర్‌ బోర్డు నిర్ణయించిన విధంగా విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేయాలి. ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు. కొన్ని చోట్ల ఇంటర్‌బోర్డు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు సమాచారం వస్తోంది. అలాంటి కళాశాలలపై విచారణ జరిపి నిజమని తెలిస్తే చర్యలు ఉంటాయి. బోర్డు నిర్ణయించిన దానికంటే అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఎవరైనా తమ దృíష్టికి తెస్తే చర్యలు తప్పవు. 
 – నాగన్న, ఆర్‌ఐవో, ఇంటర్‌బోర్డు 

జిల్లాలో మొత్తం జూనియర్‌
కళాశాలలు
184
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు 27
ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు 20
సాంఘిక సంక్షేమ కళాశాలలు 17
కస్తూర్బా కళాశాలలు  10
ఒకేషనల్‌ కళాశాలలు 09
ఇన్‌సెంటివ్, మహాత్మాగాంధీ
జ్యోతిబాపూలే బ్యాక్‌వర్డు క్లాస్‌
వెల్ఫేర్‌ కళాశాలలు 
02
ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు 88
ఫస్టియర్‌ విద్యార్థులు 24,658
సెకండియర్‌ విద్యార్థులు 22,331
మొత్తం విద్యార్థులు 46,989
మరిన్ని వార్తలు