వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన

22 Dec, 2019 17:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్‌ ప్లాంట్‌కు పునాది రాయి వేయనున్నారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరోవైపు జిల్లాలో సీఎం పర్యటనపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద స్టీల్‌ప్లాంట్‌ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్‌ ఆరు నెలల్లోనే శంకుస్థాపన చేస్తున్నారు.ఇప్పటికే 3200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే 2 టీఎంసీల నీటిని కేటాయించగా, మరోవైపు స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్‌ ఓర్‌ కేటాయిస్తూ ఎన్‌ఎమ్‌డీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. త్వరలోనే అధికారులు పనులు కూడా ప్రారంభించనున్నారు.

సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌

23.12.2019 (సోమవారం)

  •   ఉదయం 9.20 – కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం
  •   9.55 గంటలకు – రిమ్స్‌లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపన
  •  10.30 గంటలకు– వైఎస్సార్‌ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం
  •  11.50 – జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ
  • మధ్యాహ్నం 2.15 గంటలకు – దువ్వూరు మండలం నేలటూరు వద్ద మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు   శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు
  •  సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరిక

24.12.2019 (మంగళవారం)

  •  ఉదయం 9.05 గంటలకు – ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌కు చేరిక
  •  9.10 – దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళి
  •  2.00 – రాయచోటి సభాస్ధలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు
  •  2.15 – వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ
  •  5.00 – పులివెందుల భాకరాపురంలోని నివాసానికి చేరుకోనున్న సీఎం

25.12.2019 (బుధవారం)

  •  ఉదయం 9.20 – క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు 
  •  11.15 – పులివెందుల జూనియర్‌ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం
  •  3.10 – కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయలుదేరుతారు.

మరిన్ని వార్తలు