టిక్కీకి రూ.150 అద్దె 

3 Apr, 2020 14:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: మిర్చిని నిల్వ చేసుకునే రైతుల నుంచి టిక్కీకి రూ.150 అద్దె వసూలు చేసేందుకు గుంటూరు కోల్డ్‌ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులు అంగీకరించారు. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును ప్రభుత్వం మూసివేసింది. దీంతో కొందరు రైతులు తమ పంటను కోల్డ్‌ స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేందుకు కొందరు నిర్వాహకులు రైతుల నుంచి రూ.200 అద్దెను వసూలు చేస్తున్నారు.

దీనిపై రైతులు బుధవారం మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాలను సేకరించిన ముఖ్యకార్యదర్శి కోల్డ్‌ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులతో గురువారం చర్చలు జరిపి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా అద్దెను నిర్ణయించారు. సీజను పూర్తయ్యేవరకు రైతుల నుంచి ఒక్కో టిక్కీకి రూ.150 అద్దెను వసూలు చేసే విధంగా, హమాలీల ఎగుమతి, దిగుమతి ఖర్చులను నిర్వాహకులే భరించాలని నిర్ణయించారు. (259 మంది ఖైదీల విడుదల

మరిన్ని వార్తలు