కరోనా లక్షణాలు ఉంటే కాల్‌ చేయండి

23 Jun, 2020 11:52 IST|Sakshi

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌  9963112781

జిల్లాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం కలెక్టర్‌ ఇంతియాజ్‌  

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అను మానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్‌ చెప్పా రు. దగ్గు, జ్వరం, జలుబు, పదార్థాల రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కలిగిన వారంతా 9963112781 నంబ రుకు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

అనంతరం ఎస్‌ ఎం ఎస్‌ ద్వారా కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ కస్టమర్‌కు అందుతుందన్నారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు వెబ్‌ లింక్‌ http://covidandhrapradesh. veeraheathcare.comద్వారా నమోదు చేసుకోవాలని కోరారు.

వైద్యపరీక్షలు నిర్వహించేందుకు 10 మొబైల్‌ ఐ మాస్క్‌ బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి జిల్లాలోని 10 ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి బస్సులో 10 ప్రత్యేక కౌంటర్లు ఉంటా యని చెప్పారు. విజయవాడ నగరంలో కృష్ణలంక, గాంధీ స్కూల్, ఇందిరాగాంధీ స్టేడియం, బసవపున్నయ్య స్టేడియం, గుణదల మేరీమాత టెంపుల్, రైల్వే స్టేషన్‌ వద్ద, జిల్లాలోని మచిలీపట్నం, నూజివీడు, జగ్గయ్యపేట, ఇబ్రహీం పట్నంలో ఐ మాస్క్‌ బస్సులను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమా వేశంలో జేసీ (రెవెన్యూ) కె మాధవీలత, డా. రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 64,110 మందికి కరోనా పరీక్షలు
జిల్లాలో ఇప్పటివరకు 64,110 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీటిలో మొత్తం 1115 కేసులు నమోదు కాగా వారిలో 684 మంది డిశ్చార్జ్‌ అయినట్లు చెప్పారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 455 మాత్రమే ఉన్నాయన్నారు.
61.35 శాతం మంది ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అయినట్లు చెప్పారు. 5 క్వారంటైన్‌ సెంటర్లలో 317 మంది ఉన్నారన్నారు. వీరందరికీ అవసమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు