వైద్య శాఖలో అవినీతి జాడ్యం?

1 Feb, 2014 04:09 IST|Sakshi

 సాక్షి, ఏలూరు :
 వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి జాడ్యం పట్టుకుంది. ఈ శాఖలో వరుసగా అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా రూ.9 లక్షలను పక్కదారి పట్టించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఉన్నతాధికారి  ఒకరు ఈ సొమ్మును కాజేశారనే ఆరోపణ శుక్రవారం గుప్పుమంది. దీనిపై ఆరా తీసేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరూ కార్యాల యంలో అందుబాటులో లేరు. ఫోన్ చేసినా స్పందించలేదు. జిల్లాలో ఏటా పైలేరియా (బోదవ్యాధి) నివారణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు డీఈసీ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు అవగాహన కల్పించే పుస్తకాలను అందిస్తున్నారు.
 
  ఈ కార్యక్రమాలు నిర్వర్తించేందుకు ప్రభుత్వం నుంచి ఈ ఏడాది రూ.24 లక్షలు వచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ నిధులలో రూ.15 లక్షలు పైలేరియా నివారణ కార్యక్రమానికి ఉపయోగించి మిగిలిన రూ.9 లక్షలను పక్కదారి పట్టించారని  తెలుస్తోంది. ఈ మొత్తానికి తప్పుడు బిల్లులను తయారు చేసేందుకు ఆ కార్యాలయ ఉద్యోగులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి టి.శకుంతలను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా, ఆమె అందుబాటులోకి రాలేదు.
 

మరిన్ని వార్తలు