రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి

2 Dec, 2023 13:49 IST|Sakshi

చెరుకుపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని తల్లీకూతుళ్లు దుర్మరణం పాలైన ఘటన ఆరుంబాక గ్రామంలో విషాదఛాయలు నింపింది. స్థానికుల కథనం ప్రకారం చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన న్యాయవాది కర్రా ప్రతాప్‌ భార్య కర్రా విజయ కుమారి(43), కుమార్తె ఆశ్రిత(20)శుక్రవారం తెల్లవారుజామున నడుచుకుంటూ చర్చికి వెళ్తుండగా చెరుకుపల్లి హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన విజయకుమారి, ఆశ్రితను స్థానికులు చెరుకుపల్లిలోని వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వై.సురేష్‌ పరిశీలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
పరామర్శించిన ఎంపీ మోపిదేవి
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మృతదేహాలను సందర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అన్నివిధాలా అండగా ఉంటామని భరోసానిచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మోపిదేవి వెంట ఎంపీపీ మత్తి దివాకర రత్నప్రసాద్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కామినేని కోటేశ్వరరావు, పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు