టీడీపీ పాలనలో.. అన్నింటా అవినీతే

3 Dec, 2018 14:28 IST|Sakshi

అందరికీ ఇళ్ల పథకంలో రాజకీయ జోక్యం 

పారదర్శకతకు పాతర అనర్హులు, స్థానికేతరులకు  ఇళ్ల కేటాయింపు

పేర్లతో సహా జాబితాను బయట పెట్టిన సామాజిక తనిఖీ బృందం

ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమ వసూళ్లు!

చర్చనీయాంశంగా మారిన హౌస్‌ఫర్‌ ఆల్‌ పథకంలో ఇళ్ల మంజూరు ప్రక్రియ  

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి కాసులు కురిపించాలి..పింఛన్‌ మంజూరు కావాలంటే అధికారపార్టీ నేతల చేయి తడపాలి. ఇళ్లు, మరుగుదొడ్ల బిల్లుల్లో వాటాలు ఇవ్వాలి.. రోడ్లు, కాలువ పనులు తదితర అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు చెల్లించాలి.. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ అవినీతే.. ప్రజాధనంతో అమలుచేసే ప్రతీ పథకం, చేసిన ప్రతీ పనిలోనూ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. తాజాగా హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో అక్రమాలు జరిగాయంటూ సామాజిక తనిఖీ అధికారులు బట్టబయలు చేశారు. అనర్హుల పేర్లుతో సహా వెల్లడించడంతో 
టీడీపీ పాలనలో సాగుతున్న అవినీతి తంతును చూసి జిల్లా వాసులు విస్తుపోతున్నారు.

విజయనగరం మున్సిపాలిటీ:  ఇందుగలడందు లేడని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. అందందే తమ అవినీతి గలదన్న చందంగా మారింది ప్రస్తుత టీడీపీ పాలన. ఏ పనిచేయాలన్నా, ఏ పథకం మంజూరు కావాలన్నా చేయి తడపాల్సిందేనన్నది  జనం నుంచి వినిపిస్తున్న మాట. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పాలకులు... సంక్షేమ పథకాల మంజూరులో చేస్తోన్న అవినీతి పరకాష్టకు చేరుకుంది. దీనికి పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేసేందుకు అమలు చేస్తోన్న హౌస్‌ఫర్‌ ఆల్‌ పథకం వేదికగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తోన్న హౌస్‌ఫర్‌ ఆల్‌ పథకం అక్రమాలకు  నిలయంగా మారింది.

నిబంధనలకు పాతరేసి స్థానికేతరులకు ఇళ్లు కేటాయింపులు చేశారంటూ సామాజిక తనిఖీల్లో వెలుగుచేసింది. బృంద సభ్యులు బహిరంగంగానే అనర్హుల పేర్లుతో సహా వెల్ల ్లడించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్‌ 279 ప్రకారం  విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ ఒక్కో కౌన్సిలర్‌ నూతన నియామకానికి రూ.30 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్టు సమాచారం. 2014 అనంతరంటీడీపీ పాలకవర్గం మున్సిపల్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కౌన్సిల్‌ ఆమోదించిన సుమారు  450 అభివృద్ధి పనుల్లో ప్రతీ పనికి పర్సెంటీజీల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నార్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
మొదటి నుంచి  అవినీతి మయమే...
హౌస్‌ఫర్‌ ఆల్‌ పథకం కింద స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు విజయనగరం మున్సిపాలిటీలో 3,090 యూనిట్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకోగా... స్థానిక పాలకవర్గాలు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయింపులు ప్రక్రియను చేపట్టేశారు. ఇదిలా ఉండగా ఒక్కో యూనిట్‌ నిర్మాణానికి రూ.3.50 లక్షలు మంజూ రు చేయనుండగా.. అందులో రూ.2.50 లక్షలు సబ్సీడీ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.లక్షలో రూ.75 వేలు బ్యాంకులోను ద్వారా చెల్లించాల్సి ఉండగా.. మరో రూ.25 వేలు మొత్తం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సబ్సీడీకింద వచ్చే రూ.2.50 లక్షల మొత్తం మంజూరు చేసేందుకు పర్సంటేజీల పేరిట వేధింపులు వస్తున్నాయి. రూ.లక్ష మొత్తం మంజూరుకు రూ.15 వేలు, రూ.2.50 లక్షల మంజూరుకు  రూ.37 వేల వరకు వసూలు చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నా రు. ఇదే పథకంలో పూర్తిగా ఇళ్లులేని వారి కోసం సారిపల్లి ప్రాంతంలో 2,880  ఇళ్లు నిర్మించి ఇచ్చేం దుకు నిర్ణయించగా.. అందుకు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ ఏడాది ఆగస్టుతో పూర్తి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ, సహకారాలతో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుడు వాటా కింద కొంత మొత్తాన్ని ముందుగా డీడీల రూపంలో చెల్లించాలని సూచించారు. ఈ మేరకు 300 స్వే్కర్‌ఫీట్, 365 స్క్వేర్‌ ఫీట్, 430 స్క్వేర్‌ ఫీట్‌ విస్తీర్ణంలో చేపడుతున్న యూనిట్ల నిర్మాణానికి ముందుగా రూ.500, రూ.10వేలు, రూ.25వేలు చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే, ఇలా రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్న వారి వద్ద నుంచి  స్థానిక కౌన్సిలర్‌లు ఒక్కోయూనిట్‌కు రూ.30వేలు నుంచి రూ.50వేలు వసూలు చేశారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇదంతా మున్సిపల్‌ పాలకులే నిర్వహించారన్నది బహిరంగ సత్యం. తాజా గా ఈ పథకం అమలులో పారదర్శకతపై సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీల్లో  అదే విషయం బట్టబయలు కావడం గమనార్హం.

 అన్నింటా రాజకీయ హస్తం.. 
పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున నిరుపేదలకు ఈ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసేందుకు 2015 సంవత్సరంలో నిర్ణయించగా... మూడేళ్ల అనంతరం ఇళ్ల కేటాయింపులు పూర్తి చేసిన ప్రక్రియపై  అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మధ్యాహ్నం మున్సిపల్‌ కార్యాలయం వేదికగా నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో ఇదే విషయాన్ని సామాజిక తనిఖీ  బృందం ప్రస్తావించిం ది. వారం రోజుల పాటు విజయనగరం మున్సి పాలిటీలో నిశిత తనిఖీలు నిర్వహించిన వారు జరిగిన అక్రమాలపై పక్కా నివేదికను రూపొం దించారు. ఎక్కడా పారదర్శకత లేకుండా కేటా యింపులు చేయటాన్ని వారు పేర్లతో సహా బయటపెట్టారు. ఇదే సామాజిక తనిఖీ ప్రొగ్రాం మేనేజర్‌ వి.వరలక్ష్మి సవివివరంగా నివేదికలో పొందుపరిచారు. విజయనగరంలో చేసిన ఇళ్ల కేటాయిం పుల్లో పక్క జిల్లాలకు చెందిన వారిని, ఇతర మండలాల వారికి ప్రాధాన్యం ఇచ్చినట్టు గుర్తిం చారు. స్థానికేతరులకు ఇళ్లు కేటాయించడం, అర్హులు కాని వారిని లబ్ధిదారులుగా పేర్కొన్నట్లు తనిఖీల్లో తేల్చారు. రాష్ట్ర పర్యవేక్షణ  కమిటీ ద్వారా వచ్చిన నిబంధనల మేరకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. 15,620 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా... ఇప్పటి వరకు 2,730 మందికి ఇళ్లు కేటాయిం చారని, ప్రధాని మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఇవ్వాల్సిన ఇళ్లకు మహిళలే అర్హులని, ఆ విధంగా 74 శాతం మంది మహిళలు మాత్రమే వారి పేరును దరఖాస్తు చేసుకోగా... మిగిలిన 26 శాతం కూడా పురుషులు దరఖాస్తులు చేసుకోవ డం వెనుక నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పథకం అమల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత మేర జోక్యం చేసుకున్నారో చెప్పనక్కర్లేదు.

సారిపల్లిలో ఇప్పటి వరకు జనరల్‌లో 1614 మందికి, బీసీలకు 351 మందికి, ఎస్సీలు 15 మందికి, ఎస్టీ ఒకరికి కేటాయించగా... మిగిలిన 1159 మందికి కులంతో సంబంధం లేకుండా కేటాయించినట్లు గుర్తించారు. మరోవైపు ఆన్‌లైన్‌ ద్వారా చేసుకో వాల్సిన దరఖాస్తులను ఆఫ్‌లైన్‌ ద్వారా చేశారని, ఇక్కడ ప్రజాప్రతినిధుల హస్తం స్పష్టంగా కనిపిం చడంలో అసలు బండారం బట్టబయలైంది. కౌన్సిలర్‌ల ద్వారా ఈ దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో పంపించి ఇళ్ల కేటాయింపులకు పాల్పడినట్లు బృంద సభ్యులే వెల్లడించడం గమనార్హం. ఇచ్చిన ఇళ్లలో కూడా ఒక్కోరేషన్‌ కార్డుకు రెండేసి ఇళ్లను కేటాయించగా, గజపతినగరం ప్రాంతంలో నివసిస్తున్న వారికి విజయనగరం పట్టణంలో ఇంటిని మంజూరు చేయడం కొసమెరుపు. ఇదే విషయాన్ని సామాజిక తనిఖీ బృంద సభ్యులు ప్రభుత్వానికి నివేదించనున్నట్టు  తెలుస్తోంది.

హౌస్‌ ఫర్‌ సే(ఆ)ల్‌... 
అవినీతిని సహించం.. అక్రమార్కులను వదిలిపె ట్టేది లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసే టీడీపీ ప్రజాప్రతినిధులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారు. ఇదే విషయం హౌస్‌ఫర్‌ ఆల్‌ పథకంలో బట్టబయలు కావడంతో  విజయనగరం మున్సి  పాలిటీలో సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. శనివారం మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమానికి కేవలం మున్సిపల్‌ కౌన్సిలర్‌లు పం పించిన లబ్ధిదారులు హాజరుకాగా... ఈ సమావేశంలో వారందరిలో ఏ ఒక్కరు అవినీతిపై పెదవి విప్పకపోగా... తనిఖీకి వచ్చిన బృంద సభ్యులు వెల్లడించిన వాస్తవాలతో వారుసైతం అవాక్కవడం గమనార్హం.

ఆధారాలు ఉన్న వారికే ఇళ్లు కేటాయించాం 
అన్ని ఆధారాలతో దరఖాస్తులు చేసుకున్న వారికే హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో ఇళ్లు కేటాయించాం. స్థానికేతరులకు ఇళ్లు కేటా యింపులు జరగలేదు. కొంతమంది వలసలు వచ్చి విజయనగరంలో జీవిస్తుండంతో వారికి రేషన్‌కార్డు స్థానికంగా ఉండడంతోనే స్థానికత ఆధారంగా ఇళ్ల కేటాయింపులు చేశాం. మరో 52 కేసుల్లో పిన్‌కోడ్‌ సమస్య తలెత్తడంతో వాటిని కూడా సరిచేశాం. అన్నింటా పారదర్శకత పాటిస్తూ వచ్చాం.  – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ     

>
మరిన్ని వార్తలు