విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు

12 Dec, 2016 15:25 IST|Sakshi
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు

అమరావతి : విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ పనులకు డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్) సోమవారం టెండర్లు పిలిచింది. ఏలూరు, బందరు రోడ్డుల్లో 26 కిలోమీటర్ల నిర్మించే కారిడార్ల డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్‌తోపాటు ఎలివేటెడ్ బ్రిడ్జి, మధ్యలో కిలోమీటరుకు ఒక స్టేషన్, ఎంట్రీ-ఎగ్జిట్ ద్వారాల నిర్మాణం, ఫ్లంబింగ్ పనులన్నింటినీ కలిపి రూ.1800 కోట్ల అంచనాతో చేపట్టాల్సివుంటుందని పేర్కొంది.

ఏలూరు రోడ్డు కారిడార్‌కు రూ.969 కోట్లు, బందరు రోడ్డు కారిడార్‌కు రూ.831 కోట్ల అంచనాతో విడిగా టెండర్లు పిలిచింది. స్టేషన్ల నిర్మాణ పనులకు సంబంధించిన టెండరు పత్రాలను డిసెంబర్ ఐదు నుంచి 16వ తేదీ వరకూ విక్రయిస్తారు. జనవరి 12 నుంచి 16వ తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలి. త్వరలో నిడమానూరులో కోచ్ డిపో, రెండు కారిడార్లలో ట్రాక్ నిర్మాణం, విద్యుత్ తదితర పనులకు విడిగా టెండర్లు పిలవనుంది.

>
మరిన్ని వార్తలు