కామెడీ ఎక్స్‌ప్రెస్‌

18 Dec, 2023 01:40 IST|Sakshi

చైతన్యారావు, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘హనీమూన్  ఎక్స్‌ప్రెస్‌’. ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌టైన్మెంట్స్, న్యూ రీల్‌ ఇండియా ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను హీరో నాగార్జున విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘వినోదాత్మకంగా సందేశంతో కూడిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటూ ఎన్నో హాలీవుడ్‌ చిత్రాలకు పని చేశాను. కానీ తెలుగు సినిమా చేయాలనేది నా కల. నాగార్జున, అమలగార్ల ్రపోత్సాహంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశాను. మా సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన నాగార్జునగారికి ధన్యవాదాలు’’ అన్నారు బాల రాజశేఖరుని. తనికెళ్ల భరణి, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: కళ్యాణీ మాలిక్, నేపథ్యసంగీతం: ఆర్‌పీ పట్నాయక్‌. 

>
మరిన్ని వార్తలు