ఒంగోలు అత్యాచార ఘటనపై డీజీపీ దిగ్భ్రాంతి

23 Jun, 2019 14:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఓ మైనర్‌ బాలికపై ఆరుగురు మృగాళ్లు అత్యాచారం చేసిన ఘటనపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.

24 గంటల్లో కేసును ఛేదించాం
ప్రకాశం : ఒంగోలులో మైనర్‌ బాలికపై లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు నల్ల చెరువుకు చెందిన మైనర్ బాలికపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. వారిలో ముగ్గురు మైనర్ విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించిన వారిని రేణుగుంట వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఫోక్సో, నిర్భయ, హత్యాచారం కింద కేసులు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు