పగిడిరాయిలో వజ్రాలు

5 Oct, 2015 19:04 IST|Sakshi

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో సోమవారం స్థానికులకు రెండు వజ్రాలు  లభించాయి. వాటిని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.25 వేలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. వర్షాలు పడినప్పుడు ఈ ప్రాంతంలో వజ్రాలు లభిస్తాయని స్థానికుల నమ్మకం. వజ్రాల కోసం స్థానికులు వెతకటం సర్వ సాధారణం. కాగా.. వజ్రాలకు సంబంధించి సమాచారం కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా