మహిళల్ని కించపరచిన అచ్చెన్నాయుడు ఖబడ్దార్‌

31 Jan, 2019 08:47 IST|Sakshi
టెక్కలి చేరీవీధి ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, పార్టీ నాయకులు

టెక్కలి అంబేడ్కర్‌ కూడలిలో మానవహారం, నినాదాలు

వైఎస్సార్‌ సీపీ నాయకులు  దువ్వాడ, తిలక్‌ల ఆధ్వర్యంలో  పాదయాత్ర

 సమస్యలు తెలుసుకుంటూ...సాగిన ప్రజా చైతన్యయాత్ర

శ్రీకాకుళం  ,టెక్కలి: ‘మహిళల్ని కించపరచిన అచ్చెన్నాయుడు ఖబడ్డార్‌... ప్రజలంటే నీకంత చులకనభావమా... పద్ధతి మార్చుకోకపోతే తగిన బుద్ధి తప్పదు... మహిళల పట్ల హీనంగా వ్యాఖ్యానించిన ఈయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలి’ అంటూ వైఎస్సార్‌ సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలసి స్థానిక అంబేడ్కర్‌ కూడలిలో మానవహారం చేపట్టారు. స్థానికంగా మంత్రి అక్రమాలకు ప్రజలు విసిగిపోయారని, దీన్ని భరించలేక మహిళల్ని ఇష్టానుసారంగా ధూషిస్తున్నారని, ఈయనకు గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. మంత్రి అచ్చెన్న డౌన్‌డౌన్‌.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పట్టణంలో సమస్యలు తెలుసుకుని, టీడీపీ ప్రభుత్వం చేతిలో బలైపోయిన సామాన్యులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులంతా స్థానిక చేరీవీధిలో కిల్లిపోలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి పాదయాత్ర కొనసాగించారు. ఇందులో భాగంగా చిన్నచేరీవీధి, పెద్దచేరీవీధి, గొడగలవీధి, గందరగోళంవీధి, కుమ్మరివీధి, రెడ్‌క్రాస్‌వీధి, అక్కపువీధి వరకు దారి పొడవునా సమస్యలు తెలుసుని ప్రజలకు భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, మండల కన్వీనర్‌ బీ గౌరీపతి, పట్టణాధ్యక్షుడు టీ కిరణ్, నాయకులు వై చక్రవర్తి, ఎన్‌ శ్రీరామ్ముర్తి, టీ జానకీరామయ్య, సత్తారు సత్యం, చింతాడ గణపతి, బీ హరి, రమణబాబు, ఎం రమేష్, గురునాథ్‌యాదవ్‌తోపాటు టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన మండల కన్వీనర్లు, పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేటి పాదయాత్ర జరిగే ప్రాంతాలు: పట్టణంలో కోదండరామవీధి, కండ్రవీధి, తెలుకలవీధి, బీసీకాలనీ, తదితర ప్రాంతాల్లో గురువారం పాదయాత్ర నిర్వహించనున్నట్లు పట్టణాధ్యక్షుడు టీ కిరణ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు