హమ్మయ్య..! ఇప్పటికైనా కరుణించారు

1 Aug, 2014 02:46 IST|Sakshi

 ఎచ్చెర్ల క్యాంపస్: ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ సైతం కన్వీనర్ జారీ చేశారు. మేలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించగా ,ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభంకావాలి.అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం, 1956ను స్థానికతకు తెలంగాణ ప్రామాణికంగా తీసుకోవటం వలన తీవ్ర జాప్యం అవుతూ వచ్చింది. ఈ నేపధ్యంలో వివాదాలు కొనసాగుతున్నా అకడమిక్ ఏడాదిలో జాప్యం, ఎంసెట్ రాసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాకు వలస వెళ్లిపోవటం, విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి దిగొచ్చింది.
 
  ఈ ఏడాది కూడా కౌన్సెలింగ్ వెబ్ పద్దతిలోనే నిర్వహించనున్నారు. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ పురుషుల కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయగా, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో లెక్చరర్లు విధులు బహిష్కరించడంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించారు. మళ్లీ ఇక్కడ విద్యార్థి జేఏసీ నాయకులు, విద్యార్థులు ఉద్యమంలో భాగంగా అడ్డుకోవటంతో పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో వర్సిటీ సిబ్బంది వచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు.
 
 గత ఏడాది చివరకు 3950 మంది విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. గత ఏడాది ఆందోళనలు నేపధ్యంలో విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి సైతం విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీం 4850 మంది రాశారు. మూడు వేలకు తక్కువ లేకుండా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలో 34 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు.అయితే జిల్లాలో రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు గతంలో అధికారులు తెలిపారు.అయితే ఈ ఏడాది కూడా ఒకే సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. గతంలో విద్యార్థులు సహాయ కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయ్యాక  ఇంటర్నెట్ సెంటర్లలలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేవారు.
 
 పవేట్ కళాశాలల వత్తిడి, పాస్‌వర్డ్ హ్యాకింగ్, స్క్రాచ్‌కార్డ్‌పై సీక్రేట్ పాస్‌వర్డ్ ప్రవేట్ యాజమాన్యాలకు తెలిసి పోవటం, మరో పక్క ప్రవేట్ యూజమాన్యాలే నెట్ సెంటర్లు పెట్టి విద్యార్థులకు ఆప్షన్లు ఇవ్వటం వంటి సంఘటనలు జరిగేవి. ఈ నేపథ్యంలో సహాయ కేంద్రాల్లోనే ధ్రువీకరణ పత్రాల పరిశీలనలు తరువాత కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఎటువంటి విధానాన్ని అమలు చేస్తారో వేచి చూడాల్సిందే. జిల్లాలో 10 ప్రవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ప్రస్తుతం ఎనిమిది కళాశాలలు కౌన్సెలింగ్ రేసులో ఉన్నాయి .రెండు కళాశాలలు గత ఏడాది కౌన్సెలింగ్ దూరంగా ఉన్నాయి. జిల్లా కళాశాలల్లో 3132 సీట్లు ఉండగా 2012లో 1605, 2013లో 1590 మంది విద్యార్థులు చేరారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 50 శాతం లోపు వారు జిల్లా కళాశాలల్లో చేరుతుండగా మిగతా వారు ప్రభుత్వ, ఇతర పెద్ద కళాశాలల్లో చేరుతున్నారు.
 
  కౌన్సెలింగ్ షెడ్యూల్ ర్యాంకుల వారీగా తేదీలు ఇలా...
 7వ తేదీ 1 నుంచి 5 వేలు, 8వ తేదీ 5001 నుంచి 10,000, 9వ తేదీ 10001 నుంచి 15 వేలు,
 10వ తేదీ 15001 నంచి 20 వేలు, 11వ తేదీ 20001 నుంచి 38 వేలు, 12వ తేదీ     38001 నుంచి 56 వేలు, 13 వ తేదీ 56001 నుంచి 75 వేలు, 14వ తేదీ    75001 నుంచి 90 వేలు, 16వ తేదీ 90001 నుంచి 105000, 17వ తేదీ 105001 నుంచి 1.20 లక్షలు, 18వ తేదీ 120001 నుంచి 1.35 లక్షలు, 19 వ తేదీ 135001 నుంచి 1.50 లక్షలు, 20 వ తేదీ 150001 నుంచి 1.65 లక్షలు, 21వ తేదీ 165001 నుంచి 1.80 లక్షలు, 22 వ తేదీ1001 నుంచి 1.95 లక్షలు, 23వ తేదీ 195001 నుంచి చివరి వరకు  
 
 అవసరమైన ధ్రువపత్రాలు ఇవే...
  ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితరత కేటట గిరిల వారు హైదరాబాద్‌లో సాంకేతిక విద్యా భవన్‌కు  కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి.  ఒరిజనల్, మూడు సెట్ల జిరాక్సులతో హాజరుకావాలి ర్యాంక్ కార్డు, హాల్‌టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, పదో తరగతి మార్కుల మెమో, 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ, ఆరు నెలల లోపు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలి.  ఓసీ, బీసీలకు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300 కౌన్సెలింగ్ ఫీజుగా నిర్ణయించారు. అలాట్‌మెంట్ల వివరాలు, ట్యూషన్ ఫీజుల వివరాలు తరువాత తెలియజేస్తారు.
 

మరిన్ని వార్తలు