గుడ్డుకు టెండర్‌

22 Feb, 2019 13:52 IST|Sakshi

మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు గల్లంతు

రెండు నెలలుగా పలు చోట్ల ఆగిన సరఫరా

తాజాగా టెండర్లు నిర్వహించేందుకు సన్నాహాలు

పరీక్షల వేళ పౌష్టికాహారంలో కోత

నాసిరకం భోజనంపై ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను కూడా దగా చేస్తోంది. నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం అందించాల్సిన ఆహారంలో నిర్లక్ష్యం చూపిస్తోంది. పేద విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. విద్యార్థులంతా బలంగా ఉండాలని వారానికి ఐదు కోడిగుడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా ఆచరణలో అసంపూర్తిగా అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పరిస్థితి తేటతెల్లమవుతోంది. ఏజెన్సీలకు బిల్లులను సకాలంలో చెల్లించపోవడంతో పలు మండలాలకు గుడ్డు సరఫరా నిలిచిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో గుడ్ల సరఫరాకు టెండర్లను నిర్వహించాల్సి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇప్పుడు టెండర్లను నిర్వహించేందుకు సిద్ధపడుతుస్తున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రచార ఆర్భాటానికి ప్రజాధనాన్ని విచ్చలవిడి ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫౌష్టికాహారం దగ్గరకొచ్చేసరికి గుడ్లు తేలేస్తోంది. కొన్నాళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుకు ఎగనామం పెడుతోంది. జిల్లాలోని  3346 ప్రా«థమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలోని 2,71,536 మంది విద్యార్థులతో పాటు 26 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని 9306 మందికి పైగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఒక్క శనివారం మినగా íమిగతా ఐదు రోజులు కోడిగుడ్డును అందించాల్సి ఉంది. గుడ్డును పాఠశాలలకు సరçఫరా చేసే ఏజెన్సీకి గతేడాది అక్టోబర్‌లో టెండర్‌ గడువు పూర్తి అయ్యింది. ప్రభుత్వ రెండు నెలలపాటు టెండర్‌ను పొడిగించింది. కానీ గడువు పూర్తి అయిన తర్వాత పెంచడంతో మళ్లీ గుడ్లు కొనుగొలు చేసి సరఫరా చేయడంలో కొంత సమయం తీసుకోవడంతో రెండు వారాలపాటు పాఠశాలలకు గుడ్లు సరఫరా ఆగిపోయింది. తరువాత సరఫరా చేసినా  చాలా మండలాలకు గుడ్లు సక్రమంగా ఆందలేదు. బిల్లులు కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోవడంతో మరింత అలసత్వం నెలకొంది. ఫలితంగా చాలా మండలాలకు గుడ్ల సరఫరాను నిలిచిపోయింది.

పరీక్షల సమయంలో ఇబ్బందులు
ఈ నెల 27 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో పదవ తరగతికి సంబంధించి 35 వేలకుపైగా విద్యార్థులుండగా పదివేలకు ఇంటర్‌ విద్యార్థులున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వీరంతా ఎక్కువ సమయం చదువుపై దృష్టి సారించడం సహజం. ఈ సమయంలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అవసరం. కానీ మధ్యాహ్న భోజన పథకానికి చెల్లించే ధరలు తక్కువ కావడంతో చాలాచోట్ల నాసిరకమైన భోజనం అందిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేకపోతున్నారు. విద్యార్థులు ఆహారంలో గుడ్డు వేస్తారని ఆసక్తి చూపిస్తారు. గుడ్డు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు.  పరీక్షలు ముంచుకు వçస్తున్న వేళయినా స్పందించాల్సిన అవసరముంది.

ఇస్కాన్‌ పాఠశాలలు గుడ్డుకు దూరం
కడప నగరంలో 105  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్డు అందనంత దూరంలో ఉంది. మధ్యాహ్న భోజనంలోఇస్కాన్‌ సంస్థ గుడ్డును పెట్టదు.  గుడ్డును సరఫరా చేసే ఏజెన్సీ  నేరుగా వారానికి లేదా పది రోజుకోసారి తెచ్చి గుడ్లను అందిస్తున్నారు. వాటిని హెచ్‌ఎంలు పిల్లలకు అందిస్తే వారు ఇళ్లకు తీసుకెళ్లి ఇంటిళ్లిపాది వండుకుని తింటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పిల్లలకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యం నెరవేరడం లేదు. గుడ్డు సరఫరా టెండర్ల నిర్వహణ కోసం ఈనెల 28 వరకూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మార్చి 1న  జేసీ చాంబర్‌లో తెరిచి టెండర్లను నిర్వహించనున్నారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని పాఠశాలలకు గుడ్లను సరఫరా చేసేటప్పటికి సెలవులు కూడా వస్తాయని పలు విమర్శలు వస్తున్నాయి.

టెండర్ల పూర్తికాగానే..
మార్చి 1వ తేదీ గుడ్ల సరఫరాకు సంబంధించి ఈ టెండర్‌ ఉంది. టెండర్‌ పూర్తిగానే అన్ని పాఠశాలలకు గుడ్డు సక్రమంగా అందేలా అన్ని చర్యలు తీసుకుంటాము.– పి.శైలజ, జిల్లా విద్యాశాకాధికారి

>
మరిన్ని వార్తలు