మధ్యాహ్న భోజనాల్లో పురుగు పట్టిన గుడ్లు

12 Jul, 2019 08:11 IST|Sakshi
పాఠశాలలో గురువారం విద్యార్థులకు పంపిణీ చేసిన కుళ్లిన గుడ్లు

సాక్షి, ఎ.మల్లవరం (తూర్పుగోదావరి) : మండలంలోని ఎ.మల్లవరం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం అందించిన మధ్యాహ్న భోజనాల్లో కుళ్లిన గుడ్లు వడ్డించారని పలువురు పిల్లల తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో మొత్తం 145 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాలు చేయగా వీరిలో కొంతమంది పిల్లలకు భోజనాల్లో వేసిన గుడ్లను ఇళ్లకు పట్టుకెళ్లారు. ఆ గుడ్లు వారి తల్లిదండ్రులు వలచి చూడగా అవి పురుగులు పట్టి కుళ్లిపోయి ఉన్నాయని వారు తెలిపారు. అదే విధంగా విద్యార్థులకు అందించిన గుడ్లలో సుమారు పదిహేను గుడ్లు వరకు కుళ్లిపోయినవి ఉండగా వాటిని తీసి పక్కన పెట్టామని పాఠశాల ఉపాధ్యాయులు వివరించారు. ఈ విషయాన్ని ఎంఈఓ ఎస్వీ నాయుడుకు తెలిపామన్నారు. కుళ్లిన గుడ్లు వడ్డించడంపై స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులను, మద్యాహ్న భోజన నిర్వాహకులను ప్రశ్నించగా మరోసారి ఇలాంటి తప్పు లేకుండా చూస్తామని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు