బ్యాంకును మోసగించిన ఐదుగురి అరెస్టు

25 Feb, 2015 17:48 IST|Sakshi

వైఎస్సార్ జిల్లా: నకిలీ ఆస్తి పత్రాలను సృష్టించి బ్యాంకు నుంచి రూ. కోటికి పైగా అప్పుగా తీసుకున్న మోసగాళ్లను, సహకరించిన బ్యాంకు ఉద్యోగిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కడపకు చెందిన మోడెం శ్రీనివాసులు, అతని తమ్ముడు రమేశ్, బావ బొల్లా నర్సింహులు, స్నేహితుడు వడ్డేపల్లి వెంకట సుబ్బయ్య నకిలీ ఆస్తి పత్రాలను తయారు చేశారు. వాటితో వైఎస్సార్ జిల్లా కడపలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ నుంచి రూ. కోటి 12 లక్షల 63 వేలను తీసుకున్నారు. వీరికి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణమోహన్ సాయం చేశాడు. 2012-13 కాలంలో వీరు ఏడు విడతలుగా రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు 24వతేదీ రాత్రి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు