భ్రూణహత్యల నివారణపై దృష్టి పెట్టండి

10 Jan, 2014 01:12 IST|Sakshi

 ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ :  భ్రూణహత్యల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అడిషనల్ డెరైక్టర్ కె.సుధాకర్‌బాబు ఆ శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. భ్రూణహత్యల నివారణ చట్టం అమలుపై అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖాధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి భ్రూణహత్యలను పూర్తిస్థాయిలో నివారించాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని చెప్పారు.

 రికార్డులు పరిశీలించాలని, అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నకిలీ కస్టమర్లతో స్కానింగ్ సెంటర్లపై ఆపరేషన్లు నిర్వహించి నిఘా పెట్టాలన్నారు. అందుకు సంబంధించి పలు సలహాలు, సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌ఓ రామతులశమ్మ, జిల్లా వైద్యారోగ్యశాఖ డెమో అధికారి బి.శ్రీనివాసరావు, డీపీహెచ్‌ఎన్‌వో పి.నాగరత్నం, డీపీవో సుబ్బలక్ష్మి, లీగల్ కన్సల్టెంట్ ఎంఎల్ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు