మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం

27 Dec, 2019 05:57 IST|Sakshi

అర్ధరాత్రి తీవ్ర గుండెపోటుతో మృతి  

సాక్షి,ప్రతినిధి ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) (56) బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఒంటి గంట సమయంలో తీవ్రస్థాయిలో గుండెనొప్పి రావడంతో  కుటుంబ సభ్యులు ఆయనను ఆర్‌ఆర్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన  వైద్యులు అప్పటికే మృతి చెందిన్నట్లు నిర్ధారించారు. దివంగత సినీనటుడు ఎస్వీ రంగారావుకు స్వయానా మేనల్లుడైన బడేటి బుజ్జి 1995లో రాజకీయ రంగ ప్రవేశం చేసి మున్సిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2000లోనూ గెలిచి వైస్‌ చైర్మన్‌గా పని చేశారు.

2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. బడేటి బుజ్జి మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, మంత్రి కురసాల కన్నబాబు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు నివాళులు
అరి్పంచారు. 

మరిన్ని వార్తలు