గంగ ఉన్నా.. రుణాల బెంగ

21 Oct, 2014 02:14 IST|Sakshi
  •  ప్రారంభమైన రబీ..
  •  ఇంతవరకు అందని బ్యాంక్ రుణాలు
  •  తూర్పు మండలాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే
  •  శ్రీకాళహస్తి: జిల్లాలోని తూర్పుమండలాల్లో కరువు ఛాయలు కనిపించడంలేదు. ఓ పక్క తెలుగుగంగ.. మరో పక్క స్వర్ణముఖి.. ఎంతోకొంత భూగర్భజలాలు ఉండడంతో రైతులు రబీ సాగుకు రెడీ అయిపోయారు. దుక్కులు దున్ని.. నార్లు పోసేందుకు సిద్ధమయ్యారు.
     
    గంగ ఉంటే బెంగ ఎందుకు?

    తెలుగంగ నీరు శ్రీకాళహస్తితోపాటు సత్యవేడు ని యోజకవర్గాలకు సాగునీటినందిస్తోంది. మూడు రో జుల క్రితం గంగ నీరు విడుదల కావడంతో శ్రీకాళహ స్తి, తొట్టంబేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాల్లోని 150 గ్రామాల ప్రజలు రబీ సా గుకు సమాయత్తమయ్యారు.  6.25 లక్షల ఎకరాల్లో సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు దుక్కులు దున్ని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి నార్లుపోసేందుకు ఉరకలు వేస్తున్నారు.
     
    పెట్టుబడే ప్రధాన సమస్య

    శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో మొత్తం 11 మండలాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని రైతు లు సింగిల్‌విండోలు, బ్యాంకుల్లో ఇప్పటికే చాలా అప్పులు చేశారు. గత ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంట దిగుబడి తగ్గిపోయింది. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇదీగాక వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని టీడీపీ నాయకులు గత ఎ న్నికల్లో హామీ ఇవ్వడంతో రైతులు రుణాలు కట్టడం మానేశారు. దీంతో ఆయా బ్యాంకులు, సింగిల్ విండోలకు రుణాల చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్త రుణాలు ఇచ్చేందుకు ముందుకురావడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయలేక కుమిలిపోతున్నారు.
     
    ఎరువులు కొనలేం
    ఐదు ఎకరాల్లో నాట్లు వేసేందుకు దుక్కిసిద్ధం చేశాను. పెట్టుబడులకు రూ.1.25 లక్షల వరకు అవసరం. ముందస్తుగా పంట పెడితే ఆశించిన దిగుబడి వస్తుందనే చిన్న ఆశ ఉంది. అయితే చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకులు రుణాలిస్తేనే సేద్యం చేయగలను.. లేదంటే రబీలో బీడుగా వదిలేయాల్సిందే.
     -బాలాజీరెడ్డి, కొత్తకండ్రిగ గ్రామం
     
    పెట్టుబడి లేదు
    ఆరెకరాల్లో వరి పంట సాగుచేయాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. దుక్కి దున్నలేదు. చేతిలో డబ్బులుంటే ఈపాటికే దుక్కిదున్ని నారుపోసుండేవాడ్ని. ఎరువులు, విత్తనాలకే ఇబ్బందులెదురవుతున్నాయి.  గతంలో చేసిన అప్పులు తీరక కొంత భూమి అమ్మాను. ఈసారీ..అంతేనేమో..
     -గురవయ్య, గురప్పనాయుడుకండ్రిగ
     
    రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నా
    పంటసాగుకు సమయం ఆసన్నమైంది. పెట్టుబడికి డబ్బుల్లేదు. రుణమాఫీ చేస్తారని ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు మాఫీ చేయలేదు.  ప్రయివేటు వ్యక్తుల వద్ద అప్పు తెద్దామంటే వడ్డీ ఎక్కువడుగుతున్నారు.  పంట రాకపోతే పొలం అమ్మాల్సిందే.
     -సుబ్బరామయ్య, ఇలగనూరు గ్రామం
     

మరిన్ని వార్తలు