‘సాఫ్ట్‌వేర్’కు సంతానలేమి!

16 Sep, 2013 02:00 IST|Sakshi
‘సాఫ్ట్‌వేర్’కు సంతానలేమి!
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులు ‘అమ్మా-నాన్న’ పిలుపునకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని స్త్రీ, ప్రసూతి వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాఫ్ట్‌వేర్, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఫెడరేషన్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్- గైనకాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అబ్‌స్టెట్రిక్స్’ సంయుక్తంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ’అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఫిగో అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.అరుల్‌కుమారన్, ఫోగ్సీ అధ్యక్షురాలు డాక్టర్ హేమదివాకర్,  ఫిగో ప్రెసిడెంట్ ఎలక్ట్ సీఎన్ పురందరే, ఉపాధ్యాక్షురాలు డాక్టర్ శాంతకుమారితో పాటు దేశవిదేశాల నుంచి సుమారు వెయ్యి మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొని సిజేరియన్ ఆపరేషన్లు, సంతానలేమి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. 
 
 సదస్సులో నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవీ...
  •   ఐటీ రంగాలలో పనిచేసే ఉద్యోగుల్లో ప్రతి ఏడుజంటల్లో
  •   ఒక జంట సంతాన లేమితో బాధపడుతోంది. 
  •   ఆలస్యపు వివాహాలు, మానసిక ఆందోళన, పని ఒత్తిడి,మారిన జీవన శైలి, ఊబకాయం, రుతుక్రమం తప్పడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణం
  •   సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువగా ల్యాప్‌ట్యాప్‌లను ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తిపై రేడియన్ తీవ్ర ప్రభావం  చూపుతోంది. 
  •   ప్రతి వంద జంటల్లో 15 శాతం మందికి సంతానలే మి సమస్య వల్ల చికిత్సతీసుకోవాల్సిన  అవసరం ఏర్పడుతోంది. ఆ పదిహేను శాతంలో కూడా 40 మంది పురుషులే. ఈ పెరుగుదల రేటు ఆందోళనకరంగా ఉంది.
  •   ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం ఇన్‌ఫెర్టిలిటీ రేటు 50 శాతం పెరిగింది. 
  •   దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల జంటలు  సంతానలేమితో బాధపడుతున్నాయి.
  •   మధుమేహం, రక్తపోటు, గుండెపోటు జబ్బులతో సంతాన లేమి   సమస్య పోటీపడుతోంది.
  •   ఈ సమస్యకు ఆడవారినే బాధ్యులను చేయడం తగదు...   స్త్రీ, పురుషులిద్దరూ ఇందుకు బాధ్యులే.
  •   18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ గా ఉంటోంది.
  •   అతిగా మద్యం సేవించిడం, పొగతాగడం కూడా ఇందుకు మరో కారణం.
మరిన్ని వార్తలు